ప్రేమించిందని బాలిక మర్మాగంపై కత్తులతో పొడిచి..

by Sumithra |
Murder
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకునేందుకు వెళ్లిన లవర్స్ జంటను కుటుంబీలు కిడ్నాప్ చేసి దారుణానికి పాల్పడ్డారు. మైనర్ అయిన బాలికను అత్యంత కృూరంగా చంపేశారు. ఆపై యువకుడిని కూడా హత్య చేసి వేర్వేరు రాష్ట్రాల్లో మృతదేహాలను పడేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ జంటను దేశ రాజధాని ఢిల్లీలో దుండగులు కిడ్నాప్ చేశారు. తర్వాత మధ్యప్రదేశ్‌లో హత్య చేశారు. అనంతరం మృతదేహాలను రెండు వేర్వేరు రాష్ట్రాల్లో పడేశారు. యువకుడి శవాన్ని రాజస్తాన్‌లో, బాలిక మృతదేహాన్ని మధ్యప్రదేశ్‌లో పడేసి పరారయ్యారు. మృతురాలిని మైనర్‌గా యూపీ పోలీసులు గుర్తించారు. ఆ జంట పెళ్లి చేసుకోవడానికి ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో పారిపోయి ఢిల్లీకి చేరుకున్నారు. ఆ కుటుంబాలు వారిని ఢిల్లీలో గుర్తించి, జీప్‌లో అపహరించి మధ్యప్రదేశ్‌లోని భింద్‌కు తీసుకెళ్లారు. భింద్ నుంచి గ్వాలియర్‌కు వెళ్లారు. అనంతరం దుండగులు ఇద్దరిని అత్యంత పాశవికంగా హత్య చేశారు. అమ్మాయి మర్మయవాలపై కత్తితో పొడిచారు. బాలిక కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్ లొకేషన్‌ను పోలీసులు పరిశీలించగా వారు మొదట ఢిల్లీకి, తర్వాత భింద్, గ్వాలియర్, ధోల్‌పూర్‌కు వెళ్లినట్లు గుర్తించారు. బాలిక కుటుంబాన్ని పోలీసులు విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.

Advertisement

Next Story