- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఫోన్ ట్యాపింగ్ చేసే పనిలో గెహ్లట్ ప్రభుత్వం మునిగిపోయింది
న్యూఢిల్లీ: ప్రజాప్రతినిధుల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేసే పనిలో రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం మునిగిపోయిందని, వాటిని పొలిటికల్ వెపన్ (రాజకీయ ఆయుధం)గా వినియోగిస్తోందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆరోపించారు. ‘నా ఫోన్‌ను ట్యాప్ చేశారో లేదో తెలియదు. కానీ తమ ఫోన్లను ట్యాప్ చేశారని చాలా మంది ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఫోన్లను ట్యాప్ చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్టు కనిపిస్తున్నాయని ఎమ్మెల్యేలతో అధికారులు చెప్పారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకు వెళ్లారు’ అని పైలట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే సోలంకీ తెలిపిన సంగతి తెలిసిందే.
కాగా దీనిపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు.
గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయని అన్నారు. రాజస్థాన్‌లో అలాంటి ఘటనలు జరగవని గతేడాది సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారని తెలిపారు. కానీ ఆ తర్వాత ఫోన్లను ట్యాప్ చేసిన విషయం వాస్తవమేననీ, వాటిని లీగల్‌గా ట్యాప్ చేశామనని గెహ్లట్ క్యాబినెట్‌లోని మంత్రి ఒకరు అసెంబ్లీలో ఒప్పుకున్నారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ‘తమ ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారని కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం అశోక్ గెహ్లాట్‌కు ఫిర్యాదు చేశారని తెలిసింది. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ అధ్యక్షులు వివరణ ఇవ్వాలి’అని కేంద్రమంత్రి డిమాండ్ చేశారు.