ఆర్కేకు విప్లవ నీరాజనం.. దండకారణ్యంలో కన్నీటి వీడ్కోలు

by Anukaran |   ( Updated:2021-10-16 04:30:36.0  )
ఆర్కేకు విప్లవ నీరాజనం.. దండకారణ్యంలో కన్నీటి వీడ్కోలు
X

దిశ, భద్రాచలం: మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్కేకు విప్లవ శ్రేణులు, ఆదివాసీ ప్రజల సమక్షంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. పామేడు-కొండపల్లి అటవీ గ్రామాల సరిహద్దులో శుక్రవారం సాయంత్రం ఈ అంత్యక్రియలు ముగిసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది మంది ఆదివాసీ ప్రజానీకం విప్లవ నినాదాల మధ్యన నివాళులర్పించారు. ఎర్రజెండాను కప్పి విప్లవ సంప్రదాయాల నడుమ, ప్రజల సమక్షంలో అంత్యక్రియలను పూర్తిచేసినట్లు పార్టీ కేంద్రకమిటీ పేర్కొన్నది. కొన్ని ఫోటోలనూ విడుదల చేసింది. ‘అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తాం.. మావోయిస్టు పార్టీ వర్ధిల్లాలి.. దీర్ఘకాల ప్రజాయుద్ధం వర్ధిల్లాలి..’ అంటూ పార్టీ శ్రేణులు, ఆదివాసీ ప్రజలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. తెలంగాణకు సరిహద్దు అటవీ ప్రాంతంలోనే అంత్యక్రియలను పూర్తి చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement

Next Story