- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కశ్మీరీ తొలి పవర్ లిఫ్టర్ ‘సైమా ఉబైద్’
దిశ, ఫీచర్స్ : కశ్మీర్ సంప్రదాయ కట్టుబాట్లను తెంచేసి, పవర్ లిఫ్టర్‌గా కెరీర్‌ను ఎంచుకోవడమే కాకుండా.. శ్రీనగర్‌లో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించిన తొలి కశ్మీరీ మహిళగా సైమా ఉబైద్ నిలిచారు. ప్రతి మగాడి విజయం వెనక ఓ స్త్రీ ఉందంటారు. కానీ సైమా ఉబైద్ విజయంలో మాత్రం తన భర్త ఉబేజ్ హఫీజ్ పాత్ర కీలకం. తన భర్త ప్రొత్సాహం, కోచింగ్ వల్లే ఈ విజయం సాధించానని చెబుతున్న సైమా ఉబైద్.. తమ కలలకు రెక్కలు తొడగాలని చూస్తున్న ఎంతోమంది కశ్మీరి మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది.
స్వతహాగా పవర్ లిఫ్టర్ అయిన ఉబైద్ భర్త హఫీజ్.. ఆమె పవర్‌ను గుర్తించడంతో పాటు శిక్షణ అందించి మెడల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ‘పవర్ లిఫ్టింగ్‌కు అవసరమైన దేహధారుడ్యంతో పాటు బరువులు ఎత్తడానికి కావల్సిన సహజమైన బలం ఆమెలో ఉందని గ్రహించి, నా ఆలోచనను ఆమెతో పంచుకున్నాను. ఆమె అందుకు అంగీకరించింది. మేమిద్దరం కలిసి పోటీకి సన్నద్ధం కాగా.. తన సంకల్పం, పట్టుదలతో సైమా గొప్ప మైలురాయిని సాధించింది’ అని హాఫీజ్ పేర్కొన్నాడు. శ్రీనగర్‌లోని ప్రభుత్వ కళాశాల నుండి హోమ్ సైన్స్‌లో బ్యాచిలర్స్ చేసిన సైమా.. ప్రస్తుతం మహిళలకు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేస్తోంది.
‘నేను జిమ్‌లో చేరినప్పుడు అధిక బరువు పెరగడంతో బాధపడ్డాను. ఈ క్రమంలో బరువు తగ్గేందుకు నా భర్త సాయం చేయడంతో పాటు వృత్తిగత శిక్షణ ఇచ్చాడు. వెయిట్ లిఫ్టర్‌గా కెరీర్‌ను ఎంచుకోవడానికి కూడా తనే కారణం. జమ్మూ కశ్మీర్ పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్.. తొలిసారిగా మహిళల కోసం పవర్ లిఫ్టింగ్ పోటీని నిర్వహించగా, 255 కిలోల బరువును ఎత్తి బంగారు పతకాన్ని సాధించాను. సామాజిక ఒత్తిడితో పాటు సంప్రదాయ కట్టుబాట్లతో తమ కోరికలను నెరవేర్చుకోకుండా మగ్గిపోతున్న మహిళలు ఇకనైనా ఆ కంచెలను దాటి కెరీర్‌లో ముందుకు పోవాలని, అందుకు వారికి నేనో ఉదాహరణగా ఉండాలని కోరుకుంటున్నాను. అంతేకాదు పెళ్లి, పిల్లల తర్వాత కూడా నేను నా కెరీర్ కోసం కష్టపడుతున్నాను. నేను సాధిస్తున్నప్పుడు మీరు కూడా తప్పకుండా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీరు అంకితభావంతో కృషి చేస్తే, మీ కలలను సాధించకుండా ఏ సామాజిక ఒత్తిడి మిమ్మల్ని ఆపదు’ అని సైమా అన్నారు.