- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్‌కు చేరిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా టీకా కొరత ఏర్పడిన క్రమంలో కోవాక్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లకు తోడుగా స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. శనివారం మాస్కో నుండి రాష్ట్రానికి 1,50,000 డోసుల స్పుత్నిక్ వ్యాక్సిన్ చేరుకుంది. ఎయిర్ ఇండియా 9301 విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు ఈ వాక్సిన్‌ను సరఫరా చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఇన్‌చార్జీ రాజశేఖర్, పీఆర్ఓ మహ్మద్ సలీమ్, సూపర్ వైజర్ సంపత్, సత్యనారయణ, వేదప్రకాష్ స్పుత్నిక్ వ్యాక్సిన్ బాక్సులను దిగుమతి చేసుకున్నారు. ఈ నెలలో మరో మూడు మిలియన్ డోసుల వాక్సిన్ రాష్ట్రానికి రానుంది. కరోనా వ్యాక్సిన్ కొరతతో ప్రభుత్వం రెండు రోజుల పాటు వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని బంద్ చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కోవాక్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను సరఫరా చేస్తుండగా వీటికితోడు కొత్తగా స్పూత్నిక్ వ్యాక్సిన్ను కూడా అందిస్తున్నారు.
#WATCH The first consignment of Sputnik V vaccines from Russia arrive in Hyderabad pic.twitter.com/PqH3vN6ytg
— ANI (@ANI) May 1, 2021