కొత్త లొకేషన్స్‌లో షూటింగ్ చేస్తున్నాం..

by Shyam |
కొత్త లొకేషన్స్‌లో షూటింగ్ చేస్తున్నాం..
X

దిశ, వెబ్‌డెస్క్: ‘నాటకం’ ఫేమ్ ఆశిష్ గాంధీ, ‘రంగుల రాట్నం’ ఫేమ్ చిత్ర శుక్లల కాంబినేషన్‌లో రాజకుమార్ బాబీ దర్శకత్వంలో ఎవర్ గ్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ ఉభయ గోదావరి జిల్లాల్లో జరుగుతోంది. బాబీ ఏడిద క్రియేటివ్వర్క్స్ సమర్పణలో బాబీ ఏడిద, జేష్ బొబ్బూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాతలు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ… ’ఇదొక ఇంటరెస్టింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ప్రతి సన్నివేశం కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుంది. డిసెంబర్ 2 నుంచి ఏకధాటిగా చిత్రీకరణ చేస్తున్నాం. జనవరి మొదటివారంతో సింగిల్ షెడ్యూల్‌లో సినిమా షూటింగ్ పూర్తవుతుంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని రాజమండ్రి, నిడదవోలు, కాకినాడ, ఉప్పాడ, రాజనగరం, రంపచోడవరం, గుడిసె తదితర ప్రాంతాల్లో ఇంతవరకు ఎవరూ షూటింగ్ చేయని లొకేషన్స్‌లో చేస్తున్నాం. ప్రస్తుతం 30 శాతం సినిమా పూర్తయింది. ఇందులో రెండు పాటలు ఉన్నాయి. వాటిని కూడా ఇక్కడే చిత్రీకరిస్తున్నాం. త్వరలోనే టైటిల్‌ని ప్రకటిస్తాం’’ అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed