- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గర్భవతి అయిన కూతురుపై తండ్రి ఘాతుకం.. తల్లి ముందే
దిశ, వెబ్‌డెస్క్: రోజు రోజుకు మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. తల్లి, తండ్రి, కూతురు, కొడుకు అనే బంధాలు కనుమరుగైపోతున్నాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డలు ప్రేమించారని కులం, మతం పేరుతో చంపేస్తున్నారు. డబ్బు కోసం తల్లిదండ్రులను బిడ్డలు కడతేరుస్తున్నారు. తాజాగా ఓ కన్నతండ్రి కూతురు కులాంతర వివాహం చేసుకొని గర్భవతి అయిందని తెలుసుకొని.. ఆమెను నమ్మకంగా ఇంటికి పిలిచి హతమార్చాడు. కుల దురహంకారంతో రెచ్చిపోయి కన్న బిడ్డను, కసాయి తండ్రి హతమార్చిన ఘటన జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో చోటు చేసుకుంది.
వివరాలలోకి వెళితే.. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు రాంప్రసాద్ దంపతులకు ఖుష్బూ కుమారి(20) అనే కుమార్తె ఉంది. ఆమె గత తొమ్మిది నెలల క్రితం, కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకొని ఇంట్లోనుంచి వెళ్ళిపోయింది. ఇక కూతురు ప్రేమను అంగీకరించని రాంప్రసాద్, కూతురిపై పగ పెంచుకున్నాడు. తమ కులంలో తన పరువు తీసిందని రగిలిపోయిన తండ్రి, కూతురిని ఎలాగైనా మట్టుబెట్టాలని పథకం వేశాడు. ఇక ఇటీవల ఆమె గర్భవతి అయ్యిందని తెలుసుకొని.. అతి ప్రేమ ఒలకబోస్తూ కూతురితో మాటలు కలిపాడు. తన ల్యాండ్ ని చూపిస్తాను ఇంటికి రమ్మని నమ్మించాడు. ఇక ప్రేమ పెళ్లిని ఇప్పటికైనా తల్లిదండ్రులు ఒప్పుకోవడంతో వారిని పూర్తిగా నమ్మిన ఆమె ఇంటికి బయలుదేరింది.
బుధవారం యారియా టౌన్‌షిప్ నుంచి గోవింద్‌పూర్ నవతాండ్ వద్దకు ఆటోలో వ్యవసాయ క్షేత్రం చూపించడానికి తీసుకెళ్లాడు. అక్కడ అదును చూసి తనతో పాటు తెచ్చుకున్న కత్తితో గొంతుకోశాడు. గర్భవతిని వదిలేయండి అని ఎంత బతిమాలాడిన ఆ కసాయి మనసు కరగలేదు.తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న కుమార్తెను చూసి తల్లి పెద్దగా అరుస్తూ, సాయం కోసం ఏడుపు ప్రారంభించడంతో, అతను అక్కడి నుంచి పారిపోయాడు. అయితే అప్పటికే ప్రాణాలు కోల్పోయిన ఖుష్బూని చూసి తల్లి మూర్ఛపోయింది. స్థానికుల సమాచారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు తండ్రి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.