- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం
దిశ, క్రైమ్ బ్యూరో: సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన, మానవత్వానికి మచ్చతెచ్చే దారుణ ఉదంతం, ఏ తండ్రీ చేయకూడని ఘోరాన్ని ఓ కిరాతకుడు చేశాడు. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ తండ్రి కన్నకూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గత కొద్ది నెలలుగా ఈ క్రూరత్వానికి పాల్పడుతూ.. కుటుంబ సభ్యులకు కానీ, ఇంకెవరికైనా చెప్పినా చంపేస్తానని బెదిరించాడు. ఫలితంగా ఆ మైనర్ కూతురు గర్భవతి కావడంతో… పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.. మేడ్చల్ జిల్లా కుత్భల్లాపూర్ శివాలయం నగర్‌కు చెందిన రాజు పెయింటర్ వృత్తి చేస్తాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ రోజు తన 14 ఏండ్ల కూతురిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ సమయంలో తిరగబడ్డ తన కూతురు 14 ఏండ్ల మైనర్ బాలికను కొట్టి, రెండు చేతులతో గట్టిగా పట్టుకుని బలవంతం చేశాడు. అంతే కాకుండా, ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు గానీ, ఇతరులెవరికైనా గానీ చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఈ కామ పిశాచి అప్పుడప్పుడు తన కామ వాంఛను తీర్చుకుంటున్నాడు. ముఖ్యంగా లాక్‌డౌన్ పీరియడ్‌లో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టేవాడు. ప్రస్తుతం ఆ మైనర్ బాలిక ఐదు నెలల గర్భవతి. ఈ విషయాన్ని కూతురు బుధవారం దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విషయం తెలిసిన స్థానికులు తండ్రి రాజుకు దేహశుద్ది చేశారు. పోలీసులు రాజుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.