- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana: అభివృద్దిపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ చర్యలు.. వార్డుకు ఒక ఆఫీసర్
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, అర్హులకు ప్రభుత్వ పథకాలు వేగంగా చేరేలా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా వార్డుకు ఒక ఆఫీసర్‌ను నియమించాలని ప్రభుత్వం డెసిషన్ తీసుకున్నది. దీనికి గాను 1,829 మంది గ్రూప్-4 ఉద్యోగులను వార్డు ఆఫీసర్లుగా కేటాయించింది. వీరిలో హైదరాబాద్ రీజియన్‌కు 958 మంది, వరంగల్ రీజియన్‌కు 871 మంది అలాట్ చేసింది.
50 వేలకుపైగా జనాభాకు ఒక ఆఫీసర్
రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీల్లో 3,488 వార్డులున్నాయి. ఇందులో 50 వేల జనాభా కంటే తక్కువగా ఉంటే రెండు వార్డులకు కలిపి ఒక వార్డు ఆఫీసర్, 50 వేలకుపైగా జనాభా ఉంటే ఒక వార్డు ఆఫీసర్‌ను నియమించాలని పురపాలక శాఖ నిర్ణయించింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం, కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం, నిజామాబాద్, బోడుప్పల్, ఫీర్జాదిగుడ, జవహర్‌నగర్, నిజాంపేట్, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట్, బడంగ్‌పేట పరిధిలోని ఒక్కో వార్డుకు ఒక్కో ఆఫీసర్‌ను నియమించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీల్లో రెండు వార్డులకు ఒక ఆఫీసర్‌ను కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు.
సర్టిఫికెట్ పరిశీలనకు 1,928 మంది హాజరు
పురపాలక శాఖకు కేటాయించిన 2,217 మంది గ్రూప్-4 ఉద్యోగులకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం రెండు రోజులుగా సాగుతున్నది. వీరిలో ఇప్పటి వరకు 1,928 మంది మాత్రమే హాజరయ్యారు. మిగిలిన 289 మంది ఉద్యోగులకు ఫోన్ చేసి మాట్లాడినట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్ రీజియన్ పరిధిలో 1023 మంది హాజరయ్యారు. వీరిలో వార్డు ఆఫీసర్లు 821, జూనియర్ అసిస్టెంట్లు 91, జూనియర్ అకౌంటెంట్లు 111 మంది ఉన్నారు. వరంగల్ రీజియన్ పరిధిలో 905 మంది హాజరైతే వారిలో వార్డు ఆఫీసర్లు 748 మంది, జూనియర్ అసిస్టెంట్లు 66, జూనియర్ అకౌంటెంట్లు 91 మంది ఉన్నారు.