సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణలో నారు పోసే దిక్కు లేదు..

by Rani Yarlagadda |
సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణలో నారు పోసే దిక్కు లేదు..
X

దిశ, హుజూరాబాద్: ఒకప్పుడు సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ (Seed Bowl of Telangana) అని పేరు తెచ్చుకున్న కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ ఏరియాలో ప్రస్తుతం సీడ్ వడ్లు నారు పోసే దిక్కు లేక సీడ్ ప్లాంట్ల యజమానులు, ఆర్గనైజర్లు ఇబ్బందులు పడుతున్నారు. సీడ్ వరి పెట్టించేందుకు అనేక అవస్థలు పడుతూ నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి రైతులను ఆకర్షించేందుకు అన్ని ఫ్రీ అంటూ ప్రకటించినా రైతులు ఈసారి మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. గతంలో జిల్లాలో ఎక్కువగా హుజూరాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్, శంకరపట్నం, మానకొండుర్, ఎలుకతుర్తి మండలాలను కలుపుకుని సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని పిలిచేవారు. ఈ మండలాల్లో ఆడ, మగ వరి నాటితే వచ్చిన కొద్దిపాటి ధాన్యాన్ని సీడ్ కింద ప్రాసెసింగ్ చేసి మళ్లీ కామన్ సీడ్ కింద ఇక్కడి రైతులకే కాకుండా ఇతర ప్రాంతాల రైతులకు సైతం ఇచ్చేవారు. దీంతో సీడ్ ప్లాంట్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతుండేది. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో రూ.కోట్లు పెట్టి సీడ్ ప్లాంట్లు నిర్మాణం చేశారు. పెద్ద కంపెనీలకు చెందిన బ్రాండ్‌లనే కాకుండా లోకల్‌గా కొద్దిమంది సొంతంగా సీడ్ ప్రాసెసింగ్ చేసి రూ.కోట్లు సంపాదించారు. వీరి వ్యాపారానికి బ్యాంక్‌లు సైతం రూ.కోట్ల అప్పు ఇచ్చాయి. ఈసారి సన్న వడ్లు రైతులు సీడ్ కింద పెట్టకపోతే ఈ వ్యాపారం ఒక్కసారిగా దెబ్బతిని ప్లాంట్లు మూతపడే పరిస్థితికి దారి తీస్తుందని భావిస్తున్నారు.

ఒకప్పుడు సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని పేరు తెచ్చుకున్న కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ ఏరియాలో ప్రస్తుతం సీడ్ వడ్లు నారు పోసే దిక్కు లేక సీడ్ ప్లాంట్ల యజమానులు, ఆర్గనైజర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. సీడ్ వరి పెట్టించేందుకు నానా ఇబ్బందులు పడుతూ నానా రకాల ప్రయత్నాలు చేస్తూ చివరికి వారిని ఆకర్షించేందుకు అన్ని ఫ్రీ అంటూ ప్రకటించినా రైతులు ఈసారి మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. గతంలో జిల్లాలో ఎక్కువగా హుజూరాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్, శంకరపట్నం, మానకొండుర్, ఎలుకతుర్తి మండలాలను కలుపుకుని సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని పిలిచే వారు. ఈ మండలాల్లో ఆడ, మగ వరి నాటితే వచ్చిన కొద్దిపాటి ధాన్యాన్ని సీడ్ కింద ప్రాసెసింగ్ చేసి మళ్లీ కామన్ సీడ్ కింద ఇక్కడి రైతులకే కాకుండా ఇతర ప్రాంతాల రైతులకు సైతం ఇచ్చేవారు. దీంతో సీడ్ ప్లాంట్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుండేది. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో రూ.కోట్లు పెట్టీ సీడ్ ప్లాంట్లు నిర్మాణం చేశారు. పెద్ద కంపెనీలకు చెందిన బ్రాండ్‌లనే కాకుండా లోకల్‌గా కొద్దిమంది సొంతంగా సీడ్ ప్రాసెసింగ్ చేసి రూ.కోట్లు సంపాదించారు. వీరి వ్యాపారానికి బ్యాంక్‌లు సైతం రూ.కోట్ల అప్పు ఇచ్చాయి. ఒకవేళ ఈసారి సన్న వడ్లు రైతులు సీడ్ కింద పెట్టకపోతే వీరి వ్యాపారం ఒక్కసారిగా దెబ్బతిని ప్లాంట్లు మూతపడే పరిస్థితికి దారి తీస్తుందని భావిస్తున్నారు.

బోనస్ దెబ్బ తీసిందా..?

ఈసారి వరి పంటపై సీఎం ప్రకటించిన బోనస్ సీడ్ వరి పంటను దెబ్బ తీసిందని భావిస్తున్నారు. సీడ్ వరి పంట తీయడానికి ఎక్కువ కష్టం అవుతుండడంతో ఈసారి రైతులు ఎక్కువగా సీడ్ పంటపై ఎక్కువగా ఆసక్తి చూపడం లేదని భావిస్తున్నారు. గతంలో పంట తక్కువగా వచ్చినా రేటు ఎక్కువగా రావడంతో రైతులు ఈ పంటకు మద్దతు పలికే వారు. ఈసారి రైతులు సన్న ధాన్యానికి మద్దతు ధరతోపాటుగా బోనస్ నేరుగా రైతు ఖాతాలో వేయడంతో ఎలాంటి కష్టం లేకుండా మద్దతు రావడంతో రైతులు ఈసారి ఎక్కువగా సన్న ధాన్యం కాస్తు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. దీంతో సీడ్ ప్లాంట్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. గతంలో నిల్వ ఉన్న ధాన్యం నిల్వలను ఇప్పటికే వేరే ప్రాంతాలకు సరఫరా చేశారు. దీంతో దాదాపుగా ఇప్పటికే సీడ్ ప్లాంట్లు అన్ని విత్తనాలు లేక ఖాళీ అయ్యాయి. వచ్చే సీజన్‌లో ధాన్యం విత్తనాలు ఇవ్వాలంటే సీడ్ పండితేనే వస్తుంది. లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో సీడ్ రైతులను ఆకర్షించేందుకు రైతులకు అన్ని ఫ్రీ అంటున్నారు. సీడ్ ఆర్గనైజర్లు గతంలో ఎన్నడూ లేనివిధంగా సీడ్ వరి పండించిన రైతులకు విత్తనాలు, బెరుకులు ఏరేందుకు కూలీ, హార్వెస్టింగ్, జియ మందులతోపాటుగా పెట్టుబడి సహాయం ఇస్తామని ప్రకటిస్తున్నారు. అయినా రైతులు సీడ్ వేసేందుకు సహకరించక పోవడంతో పంట పండకపోతే రూ.80వేల నుంచి రూ.లక్ష వరకు కంపెనీలను బట్టి ప్రకటిస్తున్నారు. పెట్టుబడి ఒక్కో రైతుకు ముందుగానే రూ.50వేల వరకు ఖాతాలో జమ చేస్తున్నారు.

Advertisement

Next Story