- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూతురు ఆ కోరిక కోరింది.. భర్త షాక్.. హత్య చేసిన తండ్రి!
దిశ, వెబ్‌డెస్క్: తండ్రి, బాబాయ్ కలిసి కూతురుని దారుణంగా హత్య చేశారు. ఆమెకు ముక్కుపచ్చలారని మూడేళ్ల కూతురు ఉన్నదని కూడా ఆలోచించకుండా అంతమొందించారు. కడప జిల్లా వేంపల్లెలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రొద్దుటూరుకు చెందిన వనజారాణి(29)కి వేంపల్లె పట్టణం గాండ్లవీధికి చెందిన పోరుమామిళ్ల గురువేంద్రతో 2009లో వివాహమైంది. వారికి మూడేళ్ల కూతురు ఉన్నది. ఉపాధి కోసం గురువేంద్ర దుబాయ్ పోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో భార్య వనజారాణిని తల్లిదండ్రుల వద్ద ఉంచి వెళ్లిపోయాడు. భర్త దుబాయ్ వెళ్లడంతో ఒంటరిగా ఫీల్ అయిన వనజారాణి.. ప్రొద్దుటూరులో ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
మూడు నెలల క్రితం భర్త గురువేంద్ర దుబాయ్ నుంచి వేంపల్లెకు తిరిగి వచ్చాడు. భార్యను తీసుకెళ్లడానికి వస్తే.. తనకు విడాకులు కావాలని, నీతో కాపురం చేయనని తెగేసి చెప్పింది. ఆమెకు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోకపోవడంతో కూతురు మనసు మార్చాలని అత్తమామలను కోరి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులతోపాటు బంధువులు, స్నేహితులు ఎంత నచ్చజెప్పినా ఆమె వినలేదు. చివరి ప్రయత్నంగా వనజారాణి తండ్రి రాజశేఖర్, బాబాయ్ జనార్ధన్, మరోవ్యక్తి కలిసి.. భర్తతో వెళ్లి కాపురం చేసుకోవాలని సర్ధిచెప్పారు. మూడేళ్ల కూతురు ఉన్నదని, ఆమె జీవితం ఆగం అవుతుందని బతిమిలాడారు. అయినా వనజారాణి భర్తకు విడాకులు ఇచ్చి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటా అనడంతో ఆగ్రహం చెందిన ముగ్గురు ఆమె మెడకు చున్నీ బిగించి హత్య చేశారు. సమాచారం అందుకున్న సీఐ వెంకటేశ్వర్లు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.