దారుణం.. రూ.70 వేలకు శిశువు విక్రయం

by Sumithra |
దారుణం.. రూ.70 వేలకు శిశువు విక్రయం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో దారణ ఘటన చోటుచేసుకుంది. నెలరోజుల శిశువును కన్నతండ్రే విక్రయించడం సంచలనంగా మారింది. చాదర్‌ఘాట్ పోలీసుల వివరాల ప్రకారం.. చాదర్ ఘాట్ పోలీస్టేషన్ పరిధిలో ఓ కసాయి తండ్రి తన నెలరోజుల కుమారుడిని రూ.70 వేలకు బేరం కుదుర్చుకొని విక్రయించాడు. ఊహించని ఘటనతో షాత్ తిన్న ఆ శిశువు తల్లి పోలీసులకు ఆశ్రయించింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చాదర్‌ఘాట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story