కన్న కూతురిపై తండ్రి అత్యాచారయత్నం

by Shyam |   ( Updated:2020-11-21 04:20:15.0  )
కన్న కూతురిపై తండ్రి అత్యాచారయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి-భువనగిరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే.. కన్న కూతురుపై అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం… పట్టణానికి చెందిన బొడ్డుపల్లి లక్ష్మయ్య ఆటో డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. ఆయనకు భార్య, నలుగురు కూతుర్లు ఉన్నారు. లక్ష్మయ్య తరచుగా భార్యతో గొడవ పడుతుండటంతో భార్య గత 17ఏండ్ల క్రితం లక్ష్మయ్యను వదిలి వెళ్లిపోయింది. ఈ క్రమంలో 2018 సంవత్సరంలో వీరి మూడో కూతురు మరణించడంతో విషయం తెలుసుకొని భార్య తిరిగి వచ్చి భర్త పిల్లలతో కలిసి ఉంటుంది. కాగా, గత ఇరవై రోజుల నుంచి భార్యాభర్తల మధ్యమ మళ్లీ గొడవలు మొదలయ్యాయి.

ఈ క్రమంలో నాలుగో కూతురు తండ్రికి అన్నం పెట్టే క్రమంలో కూతురుతో అసభ్యంగా ప్రవర్తించాడు. శారీరకంగా లొంగదీసుకోవడానికి ప్రయత్నించడంతో ఆమె తిరస్కరించింది. ఈ విషయం బయట ఎవరికి చెప్పకూడదని బెదిరించసాగాడు. తనకు అందరూ తెలుసని విషయం బయట పెడితే మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తా అని బెదిరించాడు. విషయం తెలిసిన తల్లి బాలికతో కలిసి స్థానిక పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై నిందితుడిపై ఫోక్సో చట్టం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు.

Advertisement

Next Story