- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ధాన్యానికి నిప్పంటించిన రైతు
దిశ, దుబ్బాక: సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సన్నరకం పంట వేసి పూర్తిగా నష్టపోయామని, నిరసన వ్యక్తం చేస్తూ… ఓ రైతు తన మూడెకరాల పంటకు నిప్పంటించి, తాను కూడా మంటల్లో పడి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… గ్రామానికి చెందిన నక్కల బాపిరెడ్డి అనే రైతు తనకున్న ఐదు ఎకరాల పొలంలో మూడు ఎకరాలు సన్నరకం, రెండు ఎకరాలు దొడ్డురకం వరిపంట సాగు చేశాడు. దొడ్డురకం పంట సాగు బాగానే పండింది. కానీ సన్నరకం వరిపంట పూర్తిగా దెబ్బతింది. దీంతో మూడెకరాల పంటను, మొత్తం అమ్మినా కనీసం పెట్టుబడి పెట్టిన పైసలు కూడా రాలేదని తీవ్ర ఆవేదన చెందాడు.
ఈ క్రమంలో ఆదివారం రైతు తన మూడెకరాల పంటకు నిప్పంటించి, తాను కూడా అదే మంటల్లో పడేందుకు ప్రయత్నించాడు. గమనించిన స్థానిక రైతులు బాపిరెడ్డిని అడ్డుకున్నారు. అనంతరం రైతు మాట్లాడుతూ… తాను ఎన్నో ఏండ్ల నుంచి దొడ్డురకం పంట వేస్తున్నానని, ఒక్క ఏడాది కూడా తనకు నష్టం జరుగలేదని వెల్లడించారు. కానీ ఈసారి సన్నరకం పండించాలని అధికారులు, ప్రభుత్వం ఒత్తిడి తేవడంతో సన్నరకం పండించి, పూర్తిగా నష్టపోయాయనని వాపోయారు. మూడెకరాల పంటమొత్తం అమ్మినా, కనీసం పెట్టుబడి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి కోసం చేసిన అప్పు ఎలా తీర్చాలో అర్ధం కావడం లేదని, ఆత్మహత్యాయత్నం చేశానని వెల్లడించారు.