‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ట్రైలర్ .. సామ్ టెర్రిఫిక్ అవతార్‌

by Anukaran |   ( Updated:2024-06-02 15:29:23.0  )
‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ట్రైలర్ .. సామ్ టెర్రిఫిక్ అవతార్‌
X

దిశ, సినిమా: ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ట్రైలర్ వచ్చేసింది. అమెజాన్ ఒరిజినల్స్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’కు సీక్వెల్‌గా వస్తున్న సీజన్ 2 ట్రైలర్ ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉంది. తమిళ్, హిందీ లాంగ్వేజెస్, కల్చర్ మిక్స్ చేస్తూ కట్ చేసిన ట్రైలర్‌.. సీక్వెల్‌ మాదిరిగా కాకుండా కంప్లీట్ న్యూ స్టోరీ చూస్తున్నట్లుగా అనిపించింది. డిజిటల్ డెబ్యూట్‌లో సమంత టెర్రిఫిక్‌గా కనిపించగా.. మనోజ్ బాజ్‌పాయ్ ఎప్పటిలాగే అదిరిపోయే టైమింగ్‌తో అమేజింగ్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. నార్త్, సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్‌లతో నిండిపోయిన మాస్టర్ పీస్ ట్రైలర్‌తో ఇంప్రెస్ అయిన నెటిజన్లు ఫస్ట్ సీజన్‌ను మించి హిట్ అవుతుందని చెప్తున్నారు.మనోజ్ బాజ్‌‌పాయ్ తన మ్యారేజ్ విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులతో ట్రైలర్ స్టార్ట్ కాగా.. తన కామిక్ టైమింగ్, యూనిక్ యాక్టింగ్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఫ్యామిలీ కోసం ఉద్యోగం మారిన మనోజ్.. చెన్నైలో టెర్రరిస్టులు అటాక్‌కు ప్లాన్‌ చేశారన్న విషయం తెలుసుకుని ఫైనల్‌గా ఈ ఆపరేషన్‌పై ముంబై నుంచి చెన్నైకి వచ్చేస్తాడు. ఈ సారి డేంజర్ న్యూ ఫేస్‌ కలిగి ఉందంటూ.. సమంత డెడ్లి క్యారెక్టర్‌కు సంబంధించిన కొన్ని గ్లింప్సెస్ అందించారు మేకర్స్. సామ్ నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌ అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ పెంచగా.. మూడు నెలలుగా సిరీస్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ జూన్ 4న స్ట్రీమింగ్ కానుండటంతో ఖుష్ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed