- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్లోబల్ ‘ఫ్యామిలీ మ్యాన్’
దిశ, వెబ్‌డెస్క్ : మనోజ్ బాజ్‌పాయ్ ప్రధానపాత్రలో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. రాజ్ అండ్ డీకే డైరెక్షన్‌లో వచ్చిన ఈ సూపర్ గ్రిప్పింగ్ సిరీస్ సీక్వెన్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా.. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఇందుకు కొవిడ్ ఓ కారణమైతే, అమెజాన్ మార్కెటింగ్ స్టంట్ మరో కారణం. కేవలం హిందీలో విడుదలైన ఫస్ట్ పార్ట్‌కు గ్లోబల్ వైడ్‌గా సూపర్ రెస్పాన్స్ ఉండటంతో.. ఆ అవకాశాన్ని క్యాష్ చేసుకుంటూ గ్లోబల్లీ రిలీజ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ డిసైడ్ అయింది. అంటే ఫారిన్ లాంగ్వేజెస్‌లోనూ సిరీస్‌ను డబ్ చేస్తోంది. అందుకే సిరీస్ రిలీజ్‌కు చాలా టైమ్ పడుతుందని తెలుస్తోంది. అమెజాన్ ఒరిజినల్‌గా వస్తున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ హిందీలో తెరకెక్కగా.. ఎట్ ఏ టైమ్ తెలుగు, తమిళ్‌తో పాటు ఫారిన్ లాంగ్వేజెస్‌లోనూ ఫిబ్రవరి 12న విడుదల కానుంది.
కాగా ఈ సిరీస్‌లో సౌత్ స్టార్ సమంత కూడా నటిస్తుండడం విశేషం. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’లో సామ్ నెగెటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుండగా.. ఈ సిరీస్‌తోనే వెబ్ వరల్డ్‌లోకి అడుగుపెట్టబోతుంది అక్కినేని వారి కోడలు.