క్రాకర్ ఆఫ్ ది సీజన్ .. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’

by Anukaran |   ( Updated:2023-12-17 17:21:35.0  )
The Family Man
X

దిశ, సినిమా : ‘నరకం అనుభవించిన మనిషి పశువైతే.. అంతకన్నా హీనంగా ప్రవర్తిస్తాడు. అందులో రాజకీయాలు మిక్స్ అయితే రాక్షసుడిగా మారిపోతాడు. హక్కుల కోసం పోరాడే ప్రతీ ఒక్కరు హీరోనే.. కానీ ఎవరు ఫ్రీడమ్ ఫైటర్స్, ఎవరు టెర్రరిస్టులు అనేది ప్రభుత్వ పాలసీలు డిసైడ్ చేస్తాయి. సమయానుకూలంగా తమ ఫార్ములాను మార్చుకుంటాయి. ఈ క్రమంలో చావు దెబ్బతిన్న రెబల్స్‌ ప్రాణాలు పోయినా సరే లక్ష్యాన్ని చేధించే వరకు ఉద్యమం నుంచి వైదొలగరు.. అమరులుగా మిగిలిపోతారు తప్పా అర్థాంతరంగా తప్పుకునేందుకు ప్రయత్నించరు. మరోవైపు నేషన్ సెక్యూరిటీ కోసం ఇలాంటి విప్లవకారులను మట్టుపెట్టేందుకు ప్రయత్నించే సూపర్ హీరోలే మన స్పెషల్ ఏజెంట్స్.. సర్కార్ సూచనలతో వ్యక్తిగత అభిప్రాయాలు వదులుకుని, దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విధుల్లో అమరులుగా మిగిలిపోతున్న వీరే రియల్ హీరోస్ ’. ఇదే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’స్టోరీ కాగా.. హెవీ ట్విస్టెడ్ స్క్రీన్‌ప్లే, గ్రిప్పింగ్‌ ‌ఎలిమెంట్స్‌తో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తోంది. మెయిన్ లీడ్స్ మనోజ్ బాజ్‌పాయ్, సమంత అక్కినేని క్రాకర్స్ ఆఫ్ ది సీజన్‌గా నిలవగా.. ఫస్ట్ సీజన్‌ను మించిన స్పై థ్రిల్లర్‌గా, అడ్వెంచరస్ డ్రామాగా కాంప్లిమెంట్స్ అందుకుంటోంది.

కథ..

ఢిల్లీలో కెమికల్ ఫ్యాక్టరీ ఎక్స్‌ప్లోజన్‌తో ఎండ్ అయిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 1లో ఉగ్రవాదుల ఘాతుకం వల్ల 48 మంది అమాయక ప్రజలు చనిపోగా మరెంతో మంది ఆస్పత్రి పాలవుతారు. ఈ ఇన్సిడెంట్‌ను ఫెయిల్యూర్‌గా తీసుకున్న శ్రీకాంత్ తివారీ(మనోజ్ బాజ్‌పాయ్) TASCను వదిలేసి ఓ కార్పొరేట్ కంపెనీలో జాయిన్ అవుతాడు. ఫ్యామిలీ మ్యాన్‌గా కుటుంబానికి అంకితమైపోతాడు. భార్య, పిల్లలతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నా.. మరోవైపు డ్యూటీలో యాక్షన్ మిస్ అవుతూ సతమతమవుతుంటాడు. ఈ క్రమంలోనే భారత ప్రధానమంత్రి బసు.. శ్రీలంకతో చైనా సంబంధాలు బలపడకుండా ఉండేందుకు లంకన్ గవర్నమెంట్‌తో ఓ ప్రాజెక్ట్ విషయమై అగ్రిమెంట్‌కు సమాయత్తమవుతుంది. అయితే తమకు ప్రత్యేక గవర్నమెంట్ కోసం శ్రీలంక ప్రభుత్వంతో పోరాడుతున్న తమిళ్ రెబల్స్ ఈ అగ్రిమెంట్‌‌ పట్ల ఆగ్రహానికి గురవుతారు. ఈ మేరకు ఒప్పందంలో భాగంగా చెన్నైలో జరిగే సమావేశానికి హాజరుకానున్న ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, శ్రీలంక ప్రధాని హత్యకు ప్లాన్ చేస్తారు. ఈ ప్లాన్‌ ఎగ్జిక్యూషన్‌‌‌లో రాజీ(సమంత అక్కినేని) లీడ్ రోల్ ప్లే చేస్తుండగా, ఐఎస్‌ఐ ఏజెంట్ సమీర్ బ్యాక్ సపోర్ట్ ఇస్తుంటాడు. మరోదారి లేకపోవడంతో ఈ ప్లాన్‌ను అడ్డుకునేందుకు శ్రీకాంత్ యాక్షన్ అవతార్‌లోకి ఎంటర్ అవుతాడు.

స్టోరీ అనాలసిస్ ..

ఢిల్లీ కెమికల్ అటాక్‌తో మనసు మార్చుకున్న శ్రీకాంత్ తివారీ TASC నుంచి క్విట్ అయి ఫ్యామిలీతో వన్ ఇయర్ గడిపేస్తాడు. అయినా సరే వైఫ్ సుచిత్రతో గొడవలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సుచి తన ఫ్రెండ్ అరవింద్‌తో రిలేషన్, లోనవాలాలో ఏం జరిగింది? లాంటి విషయాల గురించి శ్రీకాంత్‌తో చెప్పేందుకు సంకోచించడమే ఇందుకు కారణం కాగా, ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ క్లియర్ చేసుకునే క్రమంలో డాక్టర్ కౌన్సిలింగ్‌కు కూడా వెళ్తుంటారు. మరో వైపు పిల్లలు ధృతి, అధర్వ్‌లతో ఫ్యామిలీ మ్యాన్ బాండింగ్.. టీనేజర్‌ ధృతి లవ్‌స్టోరీతో ఫస్ట్ ఫోర్ ఎపిసోడ్స్ బోర్ కొట్టించినా, ఆ తర్వాత ఒక్కసారిగా కథలో వేగం పెరుగుతుంది.

క్రియేటర్స్ రాజ్ అండ్ డీకే, కో-రైటర్స్ సుమన్ కుమార్, సుపర్ణ్ వర్మ.. ఆ తర్వాతి ఐదు ఎపిసోడ్స్‌కు స్క్రిప్ట్‌ను క్లెవర్‌గా రాసుకోగా, సిరీస్ చూస్తున్నంత సేపు ఆడియన్స్ ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అప్పటిదాకా శ్రీకాంత్ ఫ్యామిలీ సీన్లతో నడిచిన కథ.. ఒక్కసారిగా సౌత్ ఏషియన్ పాలిటిక్స్‌లోకి చేంజ్ అయిపోతుంది. ఇక నార్త్ శ్రీలంకలో పోర్ట్ కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్ట్‌ను దక్కించుకుని, హిందూ మహాసముద్రంపై పట్టు పెంచుకునే చైనా ఎత్తుగడలను పసిగట్టిన భారత ప్రధాని బసు.. శ్రీలంకకు పోర్టు నిర్మాణ విషయంలో ఆఫర్ ఇస్తుంది. అయితే ఈ అగ్రిమెంట్ జరగాలంటే చైన్నైలో తలదాచుకున్న తమిళ రెబల్‌(భాస్కరన్ బ్రదర్ సుబ్బు)ను అప్పగించాలని షరతు పెడుతుంది శ్రీలంక. కానీ ఆ దేశ తమిళ్స్ భారత్‌లో వాంటెడ్ కాకపోవడంతో పాటు తమిళుల నుంచి వ్యతిరేకత వస్తుందని ముందుగా నో చెప్పినా.. తర్వాత పరిణామాల నేపథ్యంలో ఓకే చెప్తుంది భారత ప్రభుత్వం.

న్యూ బ్రాండ్ స్టోరీతో తెరకెక్కిన సిరీస్ ముంబై, చెన్నై, లండన్‌ చుట్టూ తిరుగుతుంది. ఒక పక్క శ్రీకాంత్, జేకేల మధ్య జోకింగ్ క్రాక్స్ పేలుతుండగానే.. మరో వైపు మెయిన్ రెబల్ రాజీ స్టోరీ హార్ట్‌ మెల్ట్ చేస్తుంది. మల్టిపుల్ షేడ్స్‌తో తన క్యారెక్టర్‌ను హార్డ్ ఫైటర్‌గా ప్రజెంట్ చేసిన మేకర్స్.. శ్రీకాంత్ తివారీకి తగిన అపోనెంట్‌గా చూపించారు. ప్రత్యర్థుల్లా కనిపిస్తున్న ఇద్దరి కథలు కూడా మీనింగ్‌ఫుల్‌గా పొట్రెయిట్ చేయడంలో సక్సెస్ అయ్యారు రాజ్ అండ్ డీకే. స్టైలిష్ కొరియోగ్రఫీతో యాక్షన్ సీక్వెన్స్‌ ఆకట్టుకోగా.. శ్రీకాంత్ ఆర్గ్యుమెంట్స్, రాజీ డిటర్మినేషన్‌ 413 నిమిషాల వ్యవధితో కూడిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ చూసేందుకు రీజనబుల్‌గా నిలిచాయి.

సమంత అక్కినేని..

ఈ సిరీస్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అక్కినేని వారి కోడలు.. అక్కడ కూడా మార్కులు కొట్టేసినట్టే. రాజీ పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన సామ్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందనడంలో సందేహం లేదు. బోల్డ్, ఇన్నోసెన్స్, క్రూయల్టీ, రెబలిజం.. వాట్ నాట్ అన్ని షేడ్స్‌లోనూ అదరగొట్టేసింది. డీ గ్లామరస్ రోల్, ఫిట్ బాడీ, యాక్షన్ స్టంట్స్‌తో వావ్ అనిపించేసింది. సమంత‌ యాక్టింగ్‌లో మరోకోణం చూసేందుకైనా ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ చూడాలనిపించే విధంగా తనను తాను రీఇన్వెంట్ చేసుకుంటూ, అన్ ఇమాజినబుల్ పర్ఫార్మెన్స్‌తో ట్రూ సూపర్ స్టార్ అనిపించుకుంది. బాలీవుడ్ యాక్టర్స్‌కు స్టాండర్డ్ క్రియేట్ చేస్తూ తన యాక్టింగ్ స్కిల్స్, క్యారెక్టర్ ఇన్వాల్వ్‌‌మెంట్‌తో.. సామ్‌ను బ్యాన్‌ చేయాలన్న వారి నుంచే ‘సామ్ ది గ్రేట్’ అనే కాంప్లిమెంట్స్ అందుకుంటోంది.

మనోజ్ బాజ్‌పాయ్

అటు ఫ్యామిలీ, ఇటు డ్యూటీ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఎప్పటిలాగే ‘మన ఫ్యామిలీ మ్యాన్’ ట్యాగ్‌‌కు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి పడేశాడు. కామిక్ టైమింగ్, ఎమోషనల్ సీన్స్.. ఏదైతేనేమీ ప్రతీ సీన్‌లో ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఫ్రాంచైజ్ అభిమానులకు శ్రీకాంత్‌ తివారీగా మరింత దగ్గరయ్యాడు. కొడుకు, జేకేతో కామెడీ.. సుచితో పోట్లాట.. కూతురు ఆపదలో ఉంటే కార్చే కన్నీరు.. అన్నింటిలోనూ మన శ్రీకాంత్ అదరగొట్టేశాడు.

ఎన్నో అంచనాలతో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సెకండ్ సీజన్ అంతకు మించిన రెస్పాన్స్ అందుకుంటుండగా.. థర్డ్ సీజన్‌ కూడా ఉందని క్లూ ఇచ్చారు మేకర్స్. కోల్‌కతా కేంద్రంగా కరోనా వైరస్ వ్యాప్తికి చైనా కుట్ర పన్నుతోందనే స్టోరీతో వచ్చేందుకు రెడీగా ఉన్నట్లు బోనస్ ఎపిసోడ్ ద్వారా తెలిపారు. అయితే సూసైడ్ బాంబర్‌గా కనిపించిన సామ్ చనిపోతుందా? లేదా? అనే విషయంలో క్లారిటీ ఇవ్వని మేకర్స్.. థర్డ్ సీజన్‌‌లో ఏం జరుగుతుందా అనే ఎగ్జైట్‌మెంట్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు.

Advertisement

Next Story