- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కను తల్లిని చేసిన తమ్ముడు.. తల్లిదండ్రులే సాక్ష్యం
దిశ, వెబ్ డెస్క్: 2020.. లాక్ డౌన్.. స్కూల్స్, కాలేజీ లు తెరవకపోవడంతో బంధువుల ఇంటికి వచ్చాడు ఒక యువకుడు. అక్కడ తనకు వరసయ్యే అక్కతో చనువుగా మెలిగాడు. టీచర్ అయిన అక్క కూడా తమ్ముడే కదా అని అతనితో సన్నిహితంగా మెలిగింది. ఆ సన్నిహితం కాస్తా సాన్నిహిత్యం గా మారింది. వెరసి అక్క గర్భవతి అయ్యింది. తమ్ముడి వరుస అయిన యువకుడితో కూతురు చేసిన పాడుపనిని తలుచుకొని తల్లిదండ్రులు రోధించారు. బయట పరువు పోకూడదని కూతురికి ఇంట్లోనే ప్రసవం చేశారు. పుట్టిన మగబిడ్డను చెత్తలో పడేశారు. చివరికి మృతిచెందిన కూతురికి ఎవరికి తెలియకుండా అంత్యక్రియలు కూడా చేసి చేతులు దులుపుకున్న సంఘటన చెన్నైలో ఆలస్యంగా వెలుగు చూసింది.
దిండుగల్ జిల్లా పళని సమీపంలోని ఆరుకుడికి చెందిన మణియన్ కుమార్తె (29) ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది. 2020 కరోనా లాక్ డౌన్ కారణంగా స్కూల్స్ మూసివేయడంతో ఇంట్లోనే ఉంటూ పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే యువతి బంధువుల అబ్బాయి ఆదీష్ కుమార్ (20) ఇంటికి వస్తూ, పోతూ ఉండేవాడు. యువతితో, యువకుడు చనువుగా ఉండడం మొదలుపెట్టాడు. అక్కా, తమ్ముళ్లే కదా అని తల్లిదండ్రులు సైతం అడ్డు చెప్పలేదు. ఈ క్రమంలో యువతి గర్భవతి అయ్యింది. అందుకు కారణం తమ్ముడు వరస అయ్యే యువకుడిని తెలుసుకున్న తల్లిదండ్రులు అబార్షన్ చేయించాలని చూశారు. కానీ అది వీలు కాకపోవడంతో బయట పరువు పోకూడదని యువతిని ఇంట్లోనే బంధించారు.
అయితే ఇటీవలే యువతికి నొప్పులు రావడంతో ఇంట్లోనే ఆమెకు పురుడు పోశారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇలాంటి బిడ్డ ఉండకూడదని చెప్పి తల్లిదండ్రులు పసికందును చెత్తకుండీలో పడవేశారు. అయితే, తీవ్ర రక్తస్త్రావంతో యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో, ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువతి మృతి చెందడంతో గుట్టురట్టు అయ్యింది. చుట్టుపక్కల వారి అనుమానాలతో వ్యవహారం పోలీసుల దగ్గరకు చేరింది. కేసు నమోదు చేసిన పోలీసులు యువతి తల్లిదండ్రులను, తమ్ముడు వరసయ్యే యువకుడిని అరెస్ట్ చేశారు.