మాజీ మంత్రి బలరాం నాయక్‌కు షాకిచ్చిన ఎన్నికల కమిషన్

by Shamantha N |
EX MP Balaram-Naik
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బలరాం నాయక్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆయనపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల పాటు చట్ట సభల్లో పోటీచేయకుండా ఎన్నికల సంఘం వేటు వేసింది.

బలరాం నాయక్.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మహబూబాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో నిర్ణీత గడువులోగా ఎన్నికల వ్యయానికి సంబంధించిన వివరాలను ఈసీకి సమర్పించలేదు. ఈ కారణంగానే ఆయనపై చర్యలకు సీఈసీ నిర్ణయం తీసుకుంది. అయితే, బలరాం నాయక్.. 2009లో కాంగ్రెస్ తరఫున ఎంపీగా బలరాం నాయక్‌ ఎన్నికయ్యారు. అనంతరం ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేబినెట్‌లో ఆయన మంత్రిగా పని చేశారు.

Advertisement

Next Story