పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ..

by srinivas |   ( Updated:2021-08-13 03:19:29.0  )
independence day celebrations
X

దిశ, ఏపీ బ్యూరో: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను డీజీపీ గౌతం సవాంగ్ పరిశీలించారు. శుక్రవారం ఉదయం డీజీపీ గౌతం సవాంగ్ మున్సిపల్ స్టేడియంను పరిశీలించారు. పోలీస్ పరేడ్, సీఎం ప్రసంగం మాక్‌డ్రిల్‌ను పోలీసులు నిర్వహించారు. ముఖ్యమంత్రి హాజరుకానున్న నేపథ్యంలో పోలీస్ శాఖ పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా గౌతం సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ.. “కరోనా దృష్ట్యా వీవీఐపీ, వీఐపీలతోపాటు పరిమితి స్థాయిలో మాత్రమే సందర్శకులకు అనుమతినిచ్చినట్లు తెలిపారు. వర్షంలో సైతం పరేడ్‌కు అంతరాయం కలగుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రతీ ఒక్కరూ నిబంధనలు పాటించాలని” సూచించారు.

Advertisement

Next Story