- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
అక్కడ క్రాకర్స్ పేల్చితే లక్ష జరిమానా..
న్యూఢిల్లీ: ఫైర్ క్రాకర్స్ కాల్చడం లేదా లౌడ్ స్పీకర్లతో హల్‌చల్ చేయాలనుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త. రూ. 1 లక్ష వరకు జరిమానా పడే అవకాశముంది. దేశరాజధాని ఢిల్లీలో ధ్వని కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ నిబంధనలు సవరించింది. వీటి ప్రకారం, నిర్దేశిత సమయం తర్వాత నివాస ప్రాంతాల్లో క్రాకర్స్ పేల్చితే రూ. 1 వేయి, సైలెంట్ జోన్‌లో కాల్చితే రూ. 3 వేల జరిమానా పడుతుంది. నిబంధనల ఉల్లంఘించి పెళ్లిళ్లు లేదా ఇతర వేడుకల్లో బాణాసంచా కాల్చితే రూ. 10వేల నుంచి రూ. 20వేలకు వరకు ఫైన్ విధిస్తారు. ముందస్తు అనుమతి లేకుండా 1000 కిలోవోల్ట్ ఆంపియర్(కేవీఏ)ల డీజిల్ జనరేటర్ సెట్‌తో స్పీకర్లు మోగిస్తే రూ. 1 లక్ష జరిమానా, సౌండ్ ఎమిట్టింగ్ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ వినియోగిస్తే రూ. 50వేల ఫైన్ వేస్తారు. నిర్దేశిత ప్రమాణాలకు మించి శబ్దాలు వెలువడితే రూ. 50వేల జరిమానాతోపాటు ఎక్విప్‌మెంట్‌లనూ సీజ్ చేయనున్నారు.