- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కుంభమేళకు వెళ్లొచ్చినవారు సమాచారమివ్వండి.. లేదంటే?
by vinod kumar |
X
న్యూఢిల్లీ: కుంభమేళకు వెళ్లి వచ్చే భక్తులను ఉద్దేశించి ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కుంభమేళకు వెళ్లి వచ్చిన భక్తులకు 14 రోజుల పాటు హోం క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 17వరకు కుంభమేళకు వెళ్లి వచ్చిన ఢిల్లీ వాసులు తమ వివరాలను 24 గంటల్లోగా ప్రభుత్వ వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేయాలని వెల్లడించింది. కాగా ఏప్రిల్ 18 నుంచి 30 మధ్య కుంభమేళ వెళ్లాలనుకుంటున్న భక్తులు తమ వివరాలను ముందస్తుగా ప్రభుత్వ వెబ్ సైట్‌లో నమోదు చేసుకోవాలని తెలిపింది. కుంభ మేళకు వెళ్లి వచ్చిన భక్తులెవరైనా తమ వివరాలను సమర్పించకపోతే వారిని ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌కు పంపుతామని చెప్పింది. వారిపై చట్టగా పరంగా కేసులు నమోదు చేయనున్నట్టు పేర్కొంది.
Advertisement
Next Story