ప్రపంచంలోనే ప్రాణాంతకమైన పాము.. అది లేకుంటే వందల మంది ప్రాణాలు అంతే..

by vinod kumar |   ( Updated:2021-10-21 07:38:43.0  )
ప్రపంచంలోనే ప్రాణాంతకమైన పాము.. అది లేకుంటే వందల మంది ప్రాణాలు అంతే..
X

దిశ, ఫీచర్స్ : మనుషులకు సాధరణంగా పాములంటేనే భయం. వాటికి మనమెంత భయపడుతుంటామో అవి కూడా మనమంటే అంతే భయంతో ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రమాదం నుంచి రక్షించుకునేందుకు మనిషిని కాటేస్తుంది లేదంటే పారిపోతుంది. ఈ క్రమంలోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లి తనను తాను కాపాడుకుంటుంది. కానీ ఒక పాము మాత్రం దేశాల సరిహద్దులే దాటేసింది. షిప్పింగ్ కంటైనర్‌లో భారతదేశం నుంచి ఇంగ్లాండ్‌కు సుదీర్ఘ ప్రయాణం చేసింది. కంటైనర్‌లో ఈ పామును గుర్తించిన కార్మికులు బ్రిటీష్ స్టోనసన్రీ సంస్థకు సమాచారాన్ని అందించగా.. సౌత్ ఎస్సెక్స్ వైల్డ్‌లైఫ్‌ హాస్పిటల్‌కు ఇన్‌ఫర్మేషన్ అందించారు.

కాగా ఈ సర్పాన్ని చూసిన హాస్పిటల్ సిబ్బంది.. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతకమైన పాములలో ఒకటైన సా-స్కేల్డ్ వైపర్‌ పాముగా గుర్తించారు. సరీసృపాలు చురుకుగా ఉండటానికి వెచ్చదనం అవసరమని.. చల్లని కంటెయినర్స్‌లో వారాల పాటు ఉండటం వలన పాము వల్ల కార్మికులకు ముప్పుతప్పిందని తెలిపారు. కార్మికులు నిజంగా చాలా అదృష్ఠవంతులని, లేదంటే ఇది చాలా ప్రాణలు తీసేదని బ్రిటీష్‌ సౌత్ ఎస్సెక్స్ వైల్డ్‌లైఫ్‌ హాస్పిటల్ వ్యవస్థాపకులు స్యూస్చ్వార్ ట్వీట్ చేశారు. దీంతో ఈ న్యూస్ ప్రపంచ వ్యాప్తంగా తెగ వైరల్‌ అవుతుండగా.. ఆస్పత్రి సిబ్బంది ధైర్య సాహసాలను ప్రశంసిస్తున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story

Most Viewed