అత్త టేస్ట్‌కు అనుగుణంగా బాయ్ ఫ్రెండ్ కావలెను.. కోడలు ప్రకటన

by Anukaran |   ( Updated:2021-07-17 06:24:43.0  )
amaerica news
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా అత్తాకోడళ్లు అంటే ఎలా ఉంటారు.. ఎప్పుడూ పిల్లి ఎలుకలా కొట్టుకుంటూ ఉంటారు. ఒకరిమీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ దెప్పి పొడుస్తూ ఉంటారు. కానీ మనం చెప్పుకొనే కోడలు.. దానికి విరుద్ధంగా ఉంది. అత్త బాగోగులు దగ్గర ఉండి చూసుకొంటుంది. ఆమెకు ఒక తోడు ఉండాలని ఆరాటపడుతుంది. దానికోసం ఏకంగా అత్తగారికి బాయ్ ఫ్రెండ్ కావాలంటూ పేపర్ లో ప్రకటన కూడా ఇచ్చింది. అయితే.. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. అత్తగారికి కేవలం రెండు రోజుల మాత్రమే బాయ్ ఫ్రెండ్ కావాలట. అది కూడా ఆమె వివాహానికి వెళ్లివచ్చేంతవరకేనట.. అదేంటి అనుకుంటున్నారా..? ఈ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..

అమెరికాలోని న్యూయార్క్‌లో ఉండే ఓ మహిళ(35) తన 51 ఏళ్ల అత్తతో పాటే కలిసి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మహిళ ఆగస్టులో జరగబోయే తన బంధువుల పెళ్లికి వెళ్లాలనుకుంటుంది. ఆ వివాహానికి అత్తగారిని కూడా తీసుకువెళ్లాలనుకోంది. కానీ, మామగారు కాలం చేయడంతో అత్తగారు ఒంటరిగా ఉంటున్నారు. ఎలాగైనా అత్తగారిని ఒంటరిగా ఉంచకూడదనుకుంది. ఈ వివాహ వేడుకల్లో తన అత్త కూడా అందమైన బట్టలు ధరించి మెరిసిపోవాలని ఆమె కోరుకొని పేపర్ లో ఒక ప్రకటన చేసింది. ఆగస్టులో హడ్సన్ వ్యాలీలో జరిగే ఈ పెళ్లి నిమిత్తం.. రెండు రోజుల పాటు తన అత్తకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలని ఆ ప్రకటనలో తెలిపింది. ఆ రెండు రోజుల కోసం అతనికి ఏకంగా రూ. 70 వేలు ఇస్తానని తెలిపింది. అంతేకాకుండా అత్తకు కాబోయే బాయ్ ఫ్రెండ్ ఎలా ఉండాలో కూడా ప్రకటనలో తెలిపింది.

“అతని వయసు 40 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. అతడు మంచి డ్యాన్సర్ అయి ఉండాలి. అలాగే మంచి కమ్యూనికేషన్ మెయింటెన్ చేయాలి. అతడు మంచి మాటకారి అయి ఉండాలి. అత్తగారు తెల్లటి దుస్తులు ధరిస్తారు కావున.. అందుకు సూట్ అయ్యేలా దుస్తులు ధరించాలి. ఆమెతో ఓ జంట మాదిరిగా నడుచుకోవాలి. ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి” అని మహిళ ప్రకటనలో తెలిపింది. ఇంకేముంది ఈ వింత ప్రకటనకు లెక్కలేనన్ని కామెంట్లు తన్నుకుంటూ వచ్చాయి. మీ ఆంటీ ని కళ్లలో పెట్టుకొని చూసుకుంటా అని కొందరు.. మీకు మామగారిగా అయ్యే అన్ని లక్షణాలు నాలో ఉన్నాయి అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story