విచిత్రం అంటే ఇదే.. 33 ఏళ్లకే అమ్మమ్మగా మనుమరాలితో…

by Shyam |
Youngest Grandparent
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రస్తుత కాలంలో త్వరగా పెళ్లి చేసుకునేందుకు యువత మొగ్గుచూపడం లేదు. లైఫ్‌లో సెటిల్ అవ్వాలి, కావాల్సినంత డబ్బు, ఇళ్లు ఉండాల్సిందేనంటూ 35 ఏళ్ల వరకూ పెళ్లి ద్యాసే ఎత్తడం లేదు. ఇలా లేటు చేయడం ద్వారా వారి యవ్వనాన్ని కోల్పోతున్నారు. దీంతో ముప్పైలో పెళ్లి, నలభైలో పిల్లలు అంటూ కాలం గడిపేస్తున్నారు. కానీ, యూకేలో దీనికి విరుద్ధంగా ఓ జంట రికార్ట్ సృష్టించింది. యూకేకు చెందిన భార్య భర్తలు జెన్ని మెడ్లమ్(34), రిచర్డ్(35) గురించి ప్రస్తుతం తెలియని వారు ఉండరు. వీరు అతి చిన్న వయసులో అమ్మమ్మ, తాతయ్య అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు.

మెడ్లమ్‌కు తన 16వ ఏటనే పెళ్లవగా.. ఏడాదిలోనే కూతురు పుట్టింది. తన పేరు చర్మనీ. అయితే, తన కూతురు కూడా పెళ్లి చేసుకొని 16వ ఏటనే పండంటి ఆడ బిడ్డకి జన్మనిచ్చింది. దీంతో 33 ఏళ్లకే మెడ్లమ్ అమ్మమ్మగా మారింది. దీంతో బ్రిటన్ యంగెస్ట్ గ్రాండ్ పేరెంట్‌గా గుర్తింపు పొందింది. దీనిపై నెటిజన్లు సెటైర్లు వేస్తు్న్నారు. అప్పుడే అమ్మమ్మగా ఎలా అయ్యారంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story