- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డిసెంబర్‌లోపు కరోనా టీకా సిద్ధం
న్యూఢిల్లీ: అన్ని అనుకున్నట్టు సజావుగా జరిగితే అత్యవసర వినియోగానికి కరోనా టీకాను డిసెంబర్‌లోపు సిద్ధం చేసే అవకాశముందని ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తిదారుల్లో ఒకటైన పూణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆదర్ పూనావాల వెల్లడించారు. లేదంటే వచ్చే ఏడాది రెండో లేదా మూడో త్రైమాసికంలో మొదటి దఫాగా 10 కోట్ల టీకాలను అందించడానికి ప్రణాళికలు సాగుతున్నాయని వివరించారు.
కాన్సినో, మొడర్నాల కన్నా చౌకగా తమ టీకా అందించే అవకాశముందని తెలిపారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకా సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న టీకాను సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారత్‌లో కొవిషీల్డ్ పేరుతో ట్రయల్స్ నిర్వహిస్తున్నది. ఈ టీకాకు ఎమర్జెన్సీ లైసెన్స్ కోసం ప్రయత్నించకున్నా ట్రయల్స్ డిసెంబర్‌లోగా ముగిసిపోతాయని అన్నారు. లేదా వచ్చే రెండు మూడు వారాల్లో యూకే వారి అధ్యయనాల సమాచారాన్ని పంచుకుంటే, టీకా సేఫ్ అని పక్కాగా తెలిస్తే మరో రెండు మూడు వారాల్లో ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతి కోసం భారత రెగ్యులేటరీకి తాము దరఖాస్తు చేస్తామని వివరించారు.
రెగ్యులేటరీ రివ్యూకు కూడా రెండు మూడు వారాలు పట్టొచ్చని, అలాగైతే, డిసెంబర్‌లోనే కొవిషీల్డ్ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశముందని అంచనా వేశారు. ఎమర్జెన్సీగా కాకుండా సాధారణ ప్రక్రియనే అనుసరిస్తే వచ్చే ఏడాది రెండో లేదా మూడో త్రైమాసికంలో టీకా అందుబాటులోకి రావొచ్చని వివరించారు. అప్పుడు 10 కోట్ల టీకాలను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.
ధర ఎంత ఉండొచ్చు?
సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేసే టీకా ఇతర వ్యాక్సిన్‌ల కంటే చౌకగా ఉంటుందని ఆ సంస్థ సీఈవో ఆదర్ పూనావాలా అన్నారు. సనోఫి-జీఎస్‌కే, మొడెర్నాల కన్నా తమ టీకానే తక్కువ ధరకు లభిస్తుందని తెలిపారు. టీకా ధరపై ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని, ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు. అయితే, ఈ టీకా రూ. 200లోపే అందుబాటులో ఉంటుందని చెప్పగలరని అన్నారు. మిగతా మొత్తాన్ని ప్రభుత్వం భరించే అవకాశముందని వివరించారు. ఇప్పటి వరకు వెల్లడించిన ఫలితాల ప్రకారం, ఈ టీకా సేఫ్ అని, సమర్థవంతమైందని తెలుస్తున్నదని అన్నారు. సైడ్ ఎఫెక్ట్‌లపై ఇప్పుడే చెప్పలేమని, ఒకట్రెండు సంవత్సరాల తర్వాతే టీకా దీర్ఘకాలిక ప్రభావాలను చెప్పగలమని వివరించారు.