- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎర్రవల్లిలో రచ్చబండ పెడితే ఊరుకోం..
దిశ, మర్కుక్: రైతులను అన్యాయం చేస్తున్నది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలేనని ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. శనివారం మర్కుక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో విలేకర్ల సమావేశంలో ఎర్రవల్లి గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. 70 సంవత్సరాల కాలంలో రైతులకు కాంగ్రెస్ బీజేపీలు చేసింది ఏమీ లేదని ఇప్పటివరకు రైతు బీమా, రైతు బంధు పథకాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అండగా ఉంటున్నారన్నారు. కరోనా సమయంలో కూడా రైతులకు వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, వాటిని కొన్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాటలతో ప్రజలను, రైతులను మోసం చేస్తున్నాయని, పూటకో మాట మార్చి రైతులను మోసం చేయడం తగదన్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో సమగ్ర అభివృద్ధితో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, అందులో భాగంగా ఎర్రవల్లి గ్రామంలో పాడి పంటలకు కొదవ లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరూ కూడా మా గ్రామంలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తే ఊరుకోమని గ్రామంలోకి అడుగు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎర్రవల్లి గ్రామం బంగారు తల్లిగా మారిందని ఇతర పార్టీలు వచ్చి గ్రామంలోని ఐక్యతను చెడగొట్ట వద్దని వారు హెచ్చరించారు. మా గ్రామస్తులను కేసీఆర్ కన్నబిడ్డలుగా చూసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాగ్య బిక్షపతి, విడిసి చైర్మన్ కృష్ణారెడ్డి, ఆర్ ప్రభాకర్ రెడ్డి, కమ్మరి బాలరాజు, తుమ్మ కృష్ణ, వెంకట్ రెడ్డి, పండరి, కనకయ్య, గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు.