కాంగ్రెస్ కీలక కమిటీ ఏర్పాటు.. కన్వీనర్లుగా జీవన్ రెడ్డి, భట్టి విక్రమార్క

by Anukaran |
కాంగ్రెస్ కీలక కమిటీ ఏర్పాటు.. కన్వీనర్లుగా జీవన్ రెడ్డి, భట్టి విక్రమార్క
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలను రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్‌లకు టీపీసీసీ ఎన్నికల కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలను నల్లగొండ ఎంపీ, టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం ప్రకటించారు. వరంగల్ ఎన్నికల కమిటీ కన్వీనర్‌గా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కో కన్వీనర్‌గా మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబును నియమించారు. పొన్నాల, నాయిని రాజేందర్ రెడ్డితో పాటు 13 మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. ఖమ్మం ఎన్నికల కమిటీ కన్వీనర్‌గా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కో కన్వీనర్‌గా పొన్నం ప్రభాకర్‌ను నియమించింది. డీసీసీ అధ్యక్షులు దుర్గ ప్రసాద్, రేణుకా చౌదరి, బలరాం నాయక్‌తో పాటు 11 మందితో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది.

Advertisement

Next Story