బీర్ల కంపెనీలకు షాక్.. వారికి రూ.873కోట్ల ఫైన్

by Anukaran |
బీర్ల కంపెనీలకు షాక్.. వారికి రూ.873కోట్ల ఫైన్
X

దిశ, వెబ్‌డెస్క్: బీర్ల కంపెనీలకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) షాకిచ్చింది. మార్కెట్‌ నిబంధనలకు విరుద్దంగా ధరలు పెంచుతున్న బీర్ల కంపెనీలపై సీసీఐ శుక్రవారం ఫైర్ అయ్యింది. అంతే కాకుండా కంపెనీలకు దిమ్మతిరిగేలా రూ.873కోట్ల రూపాయలను జరిమానా విధించింది. యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్, కార్ల్స్‌బర్గ్ ఇండియా, ఆల్ ఇండియా బ్రూవర్స్ అసోసియేషన్ లతో పాటు మరో 11 కంపెనీలకు జరిమానా విధించింది. కాంపిటీషన్ లా ను వ్యతిరేకిస్తూ.. కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న కంపెనీలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ సేల్, సప్లై విషయంలో ఫైన్ విధిస్తూ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సీసీఐ తెలిపింది.

ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో బీర్ల అమ్మకాలు, సరఫరాల్లో కూటమిగా ఏర్పడి మార్కెట్‌ స్వేచ్ఛను దెబ్బతీశారని పేర్కొన్న సీసీఐ పెనాల్టీని తగ్గిస్తూ.. బెనిఫిట్ ఇచ్చామని తెలిపింది. దాదాపు నాలుగేళ్ల సమగ్ర దర్యాప్తు అనంతరం సీసీఐ ఈ నిర్ణయం తీసుకోందని, కంపెనీలను సీజ్ చేయకుండా కేవలం జరిమానా మాత్రమే విధించినట్లు తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed