- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్సీ కవితకు వీఆర్వోల డిమాండ్ ఇదే!
దిశ, తెలంగాణ బ్యూరో: రాత్రింబవళ్లు కష్టపడి భూప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. సీఎం కేసీఆర్ ఆనాడు మమ్మల్ని ప్రశంసించి నెల జీతాన్ని బోనస్‌గా ఇచ్చారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మాత్రం తమకు నష్టం కలిగిస్తున్నాయని, ఐదు నెలల నుంచి ఎలాంటి పోస్టులు ఇవ్వకుండా తమతో అనధికారికంగా పనులు చేయిస్తున్నారని, తమ కుటుంబాలు ఆత్మగౌరవాన్ని కోల్పోయాయని తెలంగాణ వీఆర్వోల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ సతీష్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్సీ కవితను క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో 5,483 మంది గ్రామ రెవెన్యూ అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. వీఆర్వోల పోస్టులు రద్దయిన నాటి నుంచి గ్రామాల్లో రైతులు, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదు చేశారు. తహసీల్దార్లు, ఆర్ఐలు పని ఒత్తిడికి గురై అనారోగ్యం పాలవుతున్నారని చెప్పారు.
వీఆర్ఓలు అందరూ జీతాలు సరిపోక, కుటుంబాన్ని పోషించలేక సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల స్కూలు ఫీజులు కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. స్కూల్, కాలేజీ ఫీజులో తమకు రాయితీ కల్పించాలని కోరారు. ఎనిమిదేళ్లుగా జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నామన్నారు. అర్హులైన వారికి సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇవ్వాలని కోరారు. అతి త్వరలో సీఎంతో చర్చించి అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు నాయకులు వివరించారు. తెలంగాణ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్దేవీప్రసాద్, వీఆర్వోల సంఘం నాయకులు చింతల మురళి, రాంకుమార్, స్వామి, అర్చన, జానకి, మధులత, విజయ్ రాజు, ప్రశాంత్ తదితరులు కవితను కలిశారు.