- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలి : సీఐటీయూ
దిశ, సంగారెడ్డి: మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 9వ తేదీన దేశమంతటా జైల్ బరో కార్యక్రమాన్ని వివిధ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు నిర్వహిస్తున్నాయని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజయ్య అన్నారు. దీనిలో భాగంగా ఆ రోజున జరిగే కార్యక్రమంలో కార్మికులు, ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను విస్మరించాయని, కరోనా నుంచి ప్రజలను కాపాడలేదని అన్నారు.
కరోనా టెస్టులు విస్తృతంగా చేయాలని, ఆరోగ్య శ్రీలో కరోనా చేర్చాలని, ప్రతి వ్యక్తికి ఆరు నెలల పాటు పది కేజీల బియ్యం ఇవ్వాలని, ఇన్కమ్ టాక్స్ వర్తించని కుటుంబానికి ఆరు నెలలపాటు రూ.7500 ఇవ్వాలని, రేషన్ కార్డు లేని వారికి ఉచిత బియ్యం ఇవ్వాలని కోరారు. ఉపాధిహామీ పథకాన్ని పట్టణాలలో ప్రారంభించాలని, కార్మిక చట్టాలను సవరించకూడదని, వలస కార్మికులు ఆదుకోవాలని, పరిశ్రమలలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వారిని పర్మినెంట్ చేయాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.