- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పిల్లలతో పేడ తినిపించారు

దిశ,పాలకుర్తి : మహబూబాబాద్ తొర్రూర్ మండలం బొత్తల తండాలో ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మామిడి పిందెలు తెంపారని తోట కాపలాదారులు.. ఇద్దరు చిన్నారులపై అమానుషంగా ప్రవర్తించారు. చేతులు కట్టేసి కర్రలతో కొట్టారు, పశువుల పేడ తినిపించారు. తండాకు చెందిన బానోతు యాకూబ్, రాములు శివారులోని మామిడి తోటకు కాపలాదారులుగా ఉంటున్నారు. తొర్రూర్ కు చెందిన ఇద్దరు చిన్నారులు అమ్మాపురంలో చుట్టాలింటికి వెళ్లొచ్చేటప్పుడు తోట వద్ద ఆగి పిందెలు తెంపారు. అది చూసిన కాపలాదారులు వారిద్దరి చేతులు కట్టేసి చితకబాదారు. అంతటితో ఆగకుండా పేడ నోట్లో కుక్కి తినిపించారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు చిన్నపిల్లలని కూడా చూడకుండా కొట్టారని కాపలాదారులపై మండిపడ్డారు. అనతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం కొందరు ప్రజాప్రతినిధులు కలెక్టర్ , ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడంతో వారు వెంటనే చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.