ఘోరం.. దాని కోసం ఆరు నెలల చిన్నారిని బలి..

by Anukaran |   ( Updated:2021-12-19 05:27:52.0  )
ఘోరం.. దాని కోసం ఆరు నెలల చిన్నారిని బలి..
X

దిశ, వెబ్ డెస్క్: ముసలమ్మ మూఢనమ్మకానికి అభం శుభం ఎరుగని పసిపాప బలి అయింది. తంజావూరు జిల్లా పేరావూరని, మల్లిపట్టినం కు చెందిన షాలిషా, అస్రుద్దీన్ అనే దంపతులకు ఆరు నెలల ఆడపిల్ల ఉంది. దినసరి కూలీలు అయిన ఈ దంపతులు పాపను నస్రుద్దీన్ చిన్నమ్మ అయిన షర్మిల బేగం దగ్గర వదిలి పనులకు వెళ్లేవారు. షర్మిల బేగం భర్త అనారోగ్యంతో మంచం ఎక్కాడు. దూరపు బంధువు చెప్పిన మాట విని కేరళ కు చెందిన మహ్మద్ సలీం అనే మాంత్రికుడిని కలిసింది.

తన వద్ద ఉంటున్న పాపను బలి ఇస్తే తన భర్త ఆరోగ్యం బాగవుతుంది అని చెప్పాడు. గుడ్డిగా అతడి మాటలు నమ్మిన షర్మిలా బేగం ఆ పసి పాపను తీసుకుని మాంత్రికుడి దగ్గరికి వెళ్లింది. ఏదో పూజ చేసి ఆ చిన్నారిని బలి ఇచ్చాడు. అయితే పాప కనపడక పోయే సరికి పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయం బయట పెట్టారు. దాంతో మహమ్మద్ సలీం, షర్మిలా బేగం లను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

Advertisement

Next Story