ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కామినేని హస్పిటల్ సీఈఓ

by Shyam |   ( Updated:2021-12-26 05:00:56.0  )
ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కామినేని హస్పిటల్ సీఈఓ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిన్న పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వబోతున్నామని ప్రకటించారు. దీనిపై కామినేని హస్పిటల్ సీఈఓ గాయత్రి కామినేని స్పందించారు. ప్రధాన మంత్రి తీసుకున్న నిర్ణయం చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఆమె అన్నారు. శనివారం 15 ఏళ్లు పైబడిన పిల్లలకు వ్యాక్సినేషన్, ఫ్రంట్‌లైన్ వారియర్స్ కు బూస్టర్ డోస్ ఇస్తామని ప్రకటించారు ఇది నిజంగా స్వాగతించదగిన పరిణామం అన్నారు.

‘మేము కామినేని హాస్పిటల్స్ నుండి ఒక కోట్‌ను పంచుకోవాలనుకుంటున్నాము’ అని ఒక ప్రకటనను విడుదల చేశారు.

“15-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు కోవిడ్-19 టీకాను మరియు ఫ్రంట్‌లైన్ వారియర్స్ కు అలాగే వీరితోపాటుగా 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్ లను ప్రభుత్వం ఇస్తామనడం మేము స్వాగతిస్తున్నాము. మూడేళ్ల పైబడిన పిల్లల కోసం వ్యాక్సిన్ ట్రైల్స్ జరుగుతున్నాయి. ఇవి త్వరగా పిల్లలకు అందుబాటులోకి రావాలని ఆశిస్తున్నాము. కరోనా వైరస్ ఓమిక్రాన్ వేరియంట్ గా మారి, వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో, ప్రభుత్వం ఈ క్రియాశీల నిర్ణయం తీసుకుంది.

ఈ చర్యలు వల్ల కోవిడ్ -19 మహమ్మారి త్వరగా అదుపులోకి రావడానికి సహాయపడుతుందని మేము ఆశిస్తున్నాము. దేశంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి, అలాగే వ్యాక్సిన్ తీసుకోవాలి, మీతో పాటు మిగిలిన వారిని ముందుకు వచ్చేలా చేయాలి. ఈ మహమ్మారి నుంచి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను రక్షించుకోవాలని కోరుకుంటున్నాము, వ్యాక్సిన్ మాత్రమే కరోనా మహమ్మారి నుంచి అందరినీ కాపాడుతుంది. అందరం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సహకరిద్దాం. కలిసికట్టుగా దాన్ని ఎదిరించి పోరాడుదాం.”

Advertisement

Next Story

Most Viewed