- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి కరోనా మరణానికి సర్టిఫికేట్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారినపడి మరణించినవారందరికీ డెత్ సర్టిఫికేట్‌లో కొవిడ్ కారణంగానే మృతి చెందినట్టు పేర్కొంటామని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసింది. వారికి ఇతర దీర్ఘకాలిక వ్యాధులున్నా, కొవిడ్ కారణంగానే మరణించినట్టు ధ్రువీకరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా కాకుండా ఇతర కారణాలు మరణానికి దోహదపడ్డాయని స్పష్టంగా కనిపిస్తేనే సర్టిఫికేట్‌లో కొవిడ్‌ను ప్రస్తావించబోమని వివరించింది. ఇతర వ్యాధులున్న కరోనా పేషెంట్లు మరణిస్తే డెత్ సర్టిఫికేట్‌లో కొవిడ్‌ను పేర్కొనడం లేదని తమ దృష్టికి వచ్చిందని, డెత్ సర్టిఫికేట్‌ల జారీపై జాతీయస్థాయిలో ఉన్న విధానాలను వివరించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. డెత్ సర్టిఫికేట్‌లో కారణంగా కొవిడ్‌ను ప్రస్తావించకపోవడంతో కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పరిహారాలు పొందలేకపోతున్నామని పిటిషనర్లు తెలియజేశారు. దీనిపై కేంద్రాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది.
ఈ ప్రశ్నలకు సమాధానంగా కేంద్ర హోం వ్యవహారాల శాఖ అఫిడవిట్ సమర్పించింది. జనన, మరణాల నమోదు చట్టంలో ఒక వ్యక్తి మరణానికి గల కారణాలు ఇతరులకు తెలియజేయరాదని పేర్కొనడం వల్ల డెత్ సర్టిఫికేట్‌లో మరణానికి గల కారణాలను స్పష్టంగా పేర్కొనడం లేదని వివరించింది. అలాగే, బిహార్, మహారాష్ట్ర, మరికొన్ని రాష్ట్రాలు కరోనా మరణాలను పెద్దమొత్తంలో సవరించాయి. ఈ మరణాల నమోదు చేయకపోవడంపైనా కోర్టు ప్రశ్నించింది. కొన్ని హాస్పిటళ్లలో వైద్యుల.. కరోనా పేషెంట్లు అడ్మిట్ అయి చికిత్స పొందుతుండగా మరణిస్తే వాటిని వైద్యులు నమోదు చేస్తున్నారని కేంద్రం వివరించింది. అలాంటి పేషెంట్లు బయట మరణిస్తే, హాస్పిటల్ పార్కింగ్ లాట్‌లో మరణించినా లెక్కించడం లేదని తెలిపింది. ఇకపై అలా జరగబోదని, ప్రతి కరోనా మరణాన్ని వైద్యులు నమోదు చేయాలని, లేదంటే చర్యలు తీసుకుంటామనీ పేర్కొంది.