- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఓటీటీలు స్వీయ నిబంధనలు రూపొందించుకోవాలి’
న్యూఢిల్లీ: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి ఓటీటీ(ఓవర్ ది టాప్) సంస్థలు స్వీయ నియంత్రణ నిబంధనలు రూపొందించుకోవాలని, వాటి ఆధారంగా ఓటీటీలో ప్రసారమయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లను పర్యవేక్షించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సెన్సార్ బోర్డు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, వార్తాపత్రికలు, టీవీ న్యూస్ ఛానెళ్లు వంటివి రూపొందించుకున్నట్టే ఓటీటీలూ సెల్ఫ్ రెగ్యులేట్ రూల్స్ తయారుచేసుకోవాలని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. తద్వారా కేంద్ర ప్రభుత్వం ఓటీటీలో వచ్చే కంటెంట్‌పై జోక్యం చేసుకునే అవసరముండదని తెలిపింది. అవి రూపొందించుకున్న స్వీయ నియంత్రణ నిబంధనలనూ పాటించకపోతే తాము చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఓటీటీలో అశ్లీలతను నియంత్రించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించాలని ఢిల్లీ హైకోర్టు సూచించిందని, గతేడాది ఓటీటీ సంస్థలతో మూడు సార్లు భేటీ అయినప్పటికీ వాటిపై స్పష్టత రాలేదని పేర్కొంది. ఇటీవలే ఓటీటీలో విడుదలైన ‘తాండవ్’ చిత్రం కలకలం రేపుతున్నదని, ఈ చిత్రాన్ని నిషేధించాలని పలుసంస్థలు కేంద్రాన్ని అభ్యర్థించినట్టు వివరించింది. కాబట్టి స్వీయ నియంత్రణ నిబంధనలు రూపొందించుకోవాలని ఆదేశించింది.