- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పర్మిట్ డాక్యుమెంట్ల చెల్లుబాటు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(ఆర్‌సీ), ఫిట్‌నెస్, అన్నిరకాల పర్మిట్ డాక్యుమెంట్ల చెల్లుబాటును మరోసారి పొడిగించింది. సెప్టెంబర్ 30 దాకా వీటి వ్యాలిడిటీని పెంచుతూ అడ్వైజరీ విడుదల చేసింది. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ తెలిపింది. చివరి సారి పొడిగించిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, గతేడాది ఫిబ్రవరి 1 తర్వాత కాలం చెల్లిన డాక్యుమెంట్లన్నీ వ్యాలిడ్‌గానే పరిగణించాలి. కాబట్టి, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఈ డాక్యుమెంట్లను సెప్టెంబర్ 30 దాకా చెల్లుబాటయ్యేవిగానే పరిగణించాలని సూచించింది.
డ్రైవింగ్ టెస్టు అక్కర్లేదు
డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పలుమార్పులు చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు చేసుకునేటప్పుడు సాధారణ టెస్టు పూర్తి చేసి ఉత్తీర్ణులైనవారికి డ్రైవింగ్ టెస్టు నుంచి మినహాయింపునివ్వాలనే సవరించింది. సాధారణంగా ఆర్‌టీవో సెంటర్‌లలో డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేసేటప్పుడు డ్రైవింగ్ టెస్టు చేయడం తప్పనిసరి. కానీ, డ్రైవింగ్ టెస్టు మినహాయించాలని ఇటీవలే కేంద్రం రూల్స్‌ను సవరించింది.