- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కా.. అని వెళ్లిన బాలిక గర్భవతి అయింది
దిశ, వెబ్‌డెస్క్ : వికారాబాద్ జిల్లాలో మరో దారుణం జరిగింది. అక్కా అంటూ ఇంటికి వచ్చిన (భార్య చెల్లెలు) మరదలిపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడైన బావ. తండ్రిలా ఆదరించాల్సిన వ్యక్తి.. కీచకుడిగా మారి గర్భవతిని చేశాడు. మైనర్ బాలిక అని కూడా చూడకుండా తన కామవాంఛ తీర్చుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం..
బషీరాబాద్ మండలానికి చెందిన అప్పలరాజు ఇంటికి భార్య చెల్లెలైన మైనర్ బాలిక అక్క కోసం వస్తుండేది. అప్పలరాజు ఆ బాలికపై కన్నేసి, అదును కోసం ఎదరు చూశాడు. ఈ క్రమంలో ఓ రోజు భార్య ఇంట్లో లేని సమయంలో మరదలిపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయాన్ని బయటకు చెబితే మీ అక్కను చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక ఎవరికి చెప్పకుండా ఉన్నది. దానిని అలుసుగా తీసుకున్న అప్పలరాజు తరుచూ ఆ బాలికపై కామవాంఛ తీర్చుకున్నాడు.
ఈ క్రమంలో బాలిక రోజురోజుకు నీరసంగా మారుతూ అనారోగ్యానికి గురైంది. తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. డాక్టర్లు షాకింగ్ విషయాన్ని చెప్పారు. బాలిక గర్భం దాల్చిందని రిపోర్ట్ చేతిలో పెట్టారు. ఖంగుతిన్న తల్లిదండ్రులు బాలికను నిలదీయగా భయం భయంగా బావ చేసిన అకృత్యాన్ని వివరించింది. దీంతో బాలిక తల్లి అల్లుడిపై బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న అప్పలరాజు ఇంట్లో నుంచి పరారీ అయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.