- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి ఊరేగింపులో కారు నడిపిన నవ వధువు.. వీడియో వైరల్!
దిశ, ఫీచర్స్ : ప్రతీ ఒక్కరి జీవితంలో ‘పెళ్లి’ అనేది ఒక అపురూప ఘట్టం. కాగా ఓ నవ వధువు తన పెళ్లి వేడుకులను అ‘పూర్వ’ జ్ఞాపకాలుగా మలచుకుంది. పెళ్లి తర్వాత జరిగే అప్పగింతలు, ఊరేగింపును యూనిక్‌గా సెలబ్రేట్ చేసుకుని ఆ సంబరాలను తన మదిలో పదిలపరుచుకుంది. ఇంతకీ నవ వధువు ఏం చేసిందంటే..
పశ్చిమబెంగాల్, కోల్‌కతాకు చెందిన స్నేహ సింఘి.. సిటీలోని పలు కేఫ్‌లకు ఓనర్. అయితే తన మ్యారేజ్ వేడుకలను యూనిక్ స్టైల్‌లో చేసుకోవాలని స్నేహ ఎప్పుడో నిర్ణయించుకుంది. కాగా ఇటీవలే ఆమె కుటుంబీకులు చూపించిన వ్యక్తిని మ్యారేజ్ చేసుకున్న స్నేహ.. అప్పగింతల కార్యక్రమం తర్వాత జరిగే ఊరేగింపు(బరాత్) సందర్భంగా తనే కారు నడిపి అతిథులను ఆశ్చర్యపరిచింది. ఈ చిన్న సంఘటన ద్వారా ‘జీవితాన్ని, కారును తానే డ్రైవ్ చేస్తానని’ చెప్పకనే చెప్పిందని స్నేహ స్నేహితులు అంటున్నారు. ఈ వీడియోను స్నేహ ఇన్‌స్టా వేదికగా షేర్ చేయగా, అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వెడ్డింగ్ డే రోజున తాను రూల్స్ బ్రేక్ చేసినా, ఈ పని తనకు మరింత ఆనందాన్నిచ్చిందని పేర్కొంది స్నేహ. జీవితంలో నిర్ణయాలు చిన్నవైనా, పెద్దవైనా మహిళలు ధైర్యంగా తీసుకోగలరని ఈ వీడియో చూస్తే తెలుస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.