ప్రేమికుడి వినూత్న అభ్యర్థన.. ట్రెండింగ్‌లో ‘సారీ’ చెప్పిన పోస్టర్

by Anukaran |   ( Updated:2021-11-05 00:21:47.0  )
ప్రేమికుడి వినూత్న అభ్యర్థన.. ట్రెండింగ్‌లో ‘సారీ’ చెప్పిన పోస్టర్
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమ చాలా గొప్పది. ప్రేమ ఉన్నదగ్గరే గొడవలు ఉంటాయి అంటారు అందుకే ప్రేమికుల మధ్య ఎప్పుడూ గొడవలు వస్తుంటాయి. చిన్న చిన్న విషయాలకే గొడవపడి ఏదో పొగొట్టుకున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ప్రియురాలు అలిగితే ఆమె అలకను పొగొట్టడానికి నానా తంటాలు పడుతాడు ప్రియుడు. అయితే తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి‌లో ప్రియుడి ఆవేదన అంతా ఇంతా కాదు. వారిమధ్య ఏమైనా మనస్పర్ధలు వచ్చి ప్రేయసి అతన్ని దూరం పెట్టింది కావచ్చు.. ఆ దూరన్ని భరించలేని ప్రియుడు ప్రేయసి అలకను పొగట్టడానికి వినూత్న దారిని ఎంచుకున్నాడు.

ప్రేయసి మనసు మార్చడం కోసం.. ఆమెను క్షమించమని వేడుకుంటూ రాజమండ్రి టౌన్‌ను పోస్టర్లతో నింపేశాడు. ఎటు చూసిన నగరం మొత్తం పోస్టర్లతో నిండిపోయింది. పోస్టర్లలో ప్రేమికుడు, ప్రేయసిని ఉద్దేశించి.. ఐయామ్ వెరీ సారీ, నేను ఎలాంటి మోసం చేయలేదంటూ పేర్కొన్నాడు. ఇక ఆపోస్టర్లను చూసిన ప్రతీ ఒక్కరు ప్రేమికుడిపై జాలి చూపిస్తున్నారు. మరికొందరు ఇదేం ప్రేమరా బాబు అని నవ్వుకుంటున్నారు. ఇకనైనా ప్రేయసి, ఆ యువకున్ని క్షమించాలని మరికొందరు కోరుకుంటున్నారు. మరీ పోస్టర్లు చూసి ప్రేయసి గుండె కరిగిపోయి, ప్రియుడిని క్షమించి, తనతో సంతోషంగా ఉంటుందో చూడాలి.

Advertisement

Next Story