ఆటల్లో మునిగి ట్రాక్టర్ రివర్స్ గేర్.. బాలుడిని చిదిమేసిందిలా..!

by Sumithra |
tractor accident
X

దిశ, వెబ్‌డెస్క్ : సరదాగా పెద్దనాన్నతో పొలం పనులకు వెళ్లిన బాలుడిని మృత్యువు కబళించింది. అప్పటి వరకు అందరితో సంతోషంగా గడిపిన అతడు అనంత లోకాల్లో కలిశాడు. పిల్లలు చేసిన సరదా పనికి బలి అయ్యాడు. ఒక్కగానొక్క కుమారుడు కళ్ల ముందే కళ్లు మూయడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు.

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిననేమిల ఎక్స్ రోడ్డు‌కు చెందిన లింగాల సిద్ధార్థ (14) ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన తన పెదనాన్న లింగాల రాములు ఇంటికి వెళ్లాడు. రాములు పొలం వద్ద వరికోసిన గడ్డి కట్టుతుండగా సిద్ధార్థ కూడా పిల్లలతో కలిసి వెళ్లాడు. పని అయిపోయిన అనంతరం డ్రైవర్ ట్రాక్టర్ ను పొలంలోనే వదిలి వెళ్లాడు.

ట్రాక్టర్ డ్రైవర్ లేని సమయంలో అదే గ్రామానికి చెందిన మరొక బాలుడు ట్రాక్టర్ ను స్టార్ట్ చేశాడు. ఆ సమయంలో ట్రాక్టర్ రివర్స్ గేర్ లో ఉండడంతో దాని వెనకనే ఉన్న సిద్ధార్థ పై నుండి అది వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబీకులు చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలో బాలుడు మృతి చెందాడు.

Advertisement

Next Story