ఆ ముచ్చటే.. నాకు వినబడొద్దు: కలెక్టర్

by Shyam |

దిశ, వరంగల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అక్రమంగా జరుగుతున్న గుడుంబా తయారీపై కలెక్టర్ అజీం తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. గుడుంబా నిరోధంపై అధికారులకు ఆదేశాలిచ్చారు. జిల్లాలో గుడుంబా తయారీ మాటే వినబడొద్దని, అందుకోసం కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. జిల్లాలో నాటుసారా నియంత్రించేందుకు అధికారులు కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ అజీం ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా గుడుంబాను అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నాటుసారా తయారీ అమ్మకాలు జరగకుండా కట్టడి చేయాలన్నారు. ఇందుకోసం మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని, ఆ కమిటీలో తహశీల్దార్, ఎస్ఐ లేదా సి.ఐ, ఎక్సైజ్ ఎస్ ఐ లేదా సీఐ, గ్రామ సర్పంచ్, వీఆర్వో, పంచాయితీ సెక్రటరీ లు సభ్యులుగా ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed