కల్తీకల్లు ఘటనలో పెద్దల హస్తం?

by Sumithra |   ( Updated:2021-01-17 19:53:33.0  )
కల్తీకల్లు ఘటనలో పెద్దల హస్తం?
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై మృతిచెందినప్పటికీ ఎక్సైజ్ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా విచారణ చేస్తు న్నారు. ఈ సంఘటన జరిగి పది రోజులవుతున్నా కేసులో పురోగతి లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. పెద్దల హస్తం ఉండటంతోనే విచారణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కల్తీ కల్లు తాగి నిండు ప్రాణా లు గాల్లో కలిశాయి. అయినా అధికారుల్లో చలనం లేదు. వ్యాపారులపై చర్యలు తీసుకోకుండా సామాన్య వ్యక్తులను అరెస్ట్ చేసి మమ అనిపిస్తున్నారు. అసలు నిందితుడిని తప్పించి, పూటగడుపుకునేందుకు లైసెన్స్ లు అప్పగించిన వారిపై చర్యలు తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కల్లు దుకాణాలపై నిఘా ఏదీ..?

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కల్లు దుకాణాలపై ఎ క్సైజ్ అధికారుల నిఘా లోపించిందని తెలుస్తోంది. కేవలం రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని అర్బన్ ప్రాం తాలపై ఉన్న నిఘా గ్రామీణ ప్రాంతాలపై లేదని స్పష్టమైయింది. రంగారెడ్డిలో 541, మేడ్చల్ జిల్లాలో 219 కేసులు మాత్రమే 2020 ఏడాదిలో నమోదు చేశారు. వికారాబాద్ జిల్లాలో ఒక్క కేసుకు కూడా గతేడాది నుంచి నమోదు చేయకపోవడం గమనా ర్హం. ఈ అర్బన్ ప్రాంతాల్లోని కల్లు దుకాణాల వ్యాపా రులు మామూళ్లు ఇవ్వకపోతే కేసులు పెట్టి ఇబ్బంది గురిచేస్తున్నారని సమాచారం. అదే మా మూళ్లు క్రమంగా ఇచ్చే దుకాణాదారులుంటే వారిపై ఎన్ని ఫిర్యాదులు చేసిన అధికారులు పట్టించుకోరని ఆరోపణలు ఉన్నాయి. కల్తీకల్లు విక్రయిస్తున్న రంగారెడ్డిలోని 46, మేడ్చల్ లోని 7 దుకాణాలపై కేసులు నమోదు చేశారు. కానీ ఏడాది కాలంగా వికారాబాద్ జిల్లాలో ఒక్క కేసు నమోదు కాకపోవడంతో ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యంగా స్పష్టమవుతుంది. ఉమ్మడి జిల్లాలో 2,90,000ల ఈత, 1,10,000ల తాటి చె ట్లు ఉన్నాయి. వీటిలో సగం చెట్లకు కల్లు గీయడం లేదు. ఈ లెక్క న ఉత్పత్తి అ య్యే కల్లులో స గం లీటర్లు కల్తీదేనని స్పష్టమవుతుంది.

అసలు నిందితులు వీరేనా…

ఎక్సైజ్ అధికారులు శనివారం ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. వీరు లైసెన్స్ దారులే. కల్లు విక్రయాలతో వీరికి సంబంధం లేదని సమాచారం. వ్యాపారులను రక్షించేందుకే వీరిని అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చిట్టిగిద్ద రైల్వే స్టేషన్‌ సమీపంలోని కల్లు డిపోతో పాటు 11 దుకాణాలను సీజ్‌ చేసినట్లు అధికారులు తెలి పారు. లైసెన్స్లను లీ జుకు, కొనుగోలు చేసు కొని వ్యాపారం చేస్తున్న వారిపై కేసు నమోదు చేయాలని ప్రజా సం ఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed