- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచ రికార్డ్ కోసం.. ఒళ్లు గగుర్పొడిచేలా విన్యాసం చేస్తున్న 70 ఏళ్ల వ్యక్తి
దిశ, అంబర్ పేట్: 159వ స్వామి వివేకానంద జన్మదినం పురస్కరించుకొని ఈనెల 28న నారాయణగూడలోని మాడపాటి హనుమంత రావు బాలికల ఉన్నత పాఠశాలలో 70 ఏళ్ల డాక్టర్ కృష్ణ ఎద్దుల (ఎంబీబీఎస్) అంపశయ్యపై పడుకుని తన ఛాతిపై 159 షాబాద్ బండలను పగల కొట్టించుకొని ప్రపంచ రికార్డుల్లోకి ఆయన పేరు నమోదు చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారని పలువురు వక్తలు తెలిపారు. మంగళవారం నారాయణగూడలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ మహిళా విద్యా సంఘం సెక్రెటరీ ప్రొఫెసర్ ముత్యంరెడ్డి పాల్గొని బ్రోచర్ ని ఆవిష్కరించి, డాక్టర్ కృష్ణ ఎద్దులను అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరాటే విద్య అనేది వయసుతో నిమిత్తం లేనిదని, ఏ వయసు వారైనా చేయవచ్చునని డాక్టర్ కృష్ణ ఎద్దుల నిరూపించడం గొప్ప విషయమని అన్నారు. అనంతరం కరాటే అకాడమీ డైరెక్టర్ డాక్టర్ జి.ఎస్. గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ కృష్ణ ఎద్దుల వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, జై భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్, విశ్వం వరల్డ్ రికార్డ్, డైమండ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సాధించడానికి వయసుతో నిమిత్తం లేకుండా సాధన చేయడం అందరికీ సాధ్యం కాదని, మూడు నెలలు నిండకుండా రెండవసారి ప్రపంచ రికార్డుల్లో స్థానం సాధించడానికి ఆయన అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. రికార్డులో ఆయన విజయం సాధించి దేశానికి పేరు ప్రఖ్యాతలు తేవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాడపాటి హనుమంతరావు బాలికల ఉన్నత పాఠశాల సెక్రెటరీ డాక్టర్ సి.వసుంధర రెడ్డి, ప్రిన్సిపల్ విజితా రెడ్డి, పద్మజ అకాడమీ బ్లాక్ బెల్ట్ కరీం, నర్సింగరావు, సంతోష్, సుభాష్, రాజ్ కుమార్, మహేందర్ విప్లవ్ పాల్గొన్నారు.