అవి ఎదురు కాల్పులు కావు….

by Sridhar Babu |
Maoist party
X

దిశ,‌ప్ర‌తినిధి, ఖ‌మ్మం :
ములుగు జిల్లా మంగపేట మండలం ముసలమ్మ గుట్ట వద్ద జరిగినవి ఎదురుకాల్పులు కావ‌నీ, దొంగ ఎదురు కాల్పులంటూ మావోయిస్టు పార్టీ అభివ‌ర్ణించింది. అక్టోబర్ 18న మరో ఇద్దరు ఆదివాసి బిడ్డలను టీఆర్ఎస్ ప్రభుత్వం హత్య చేసిందని తెలిపింది. ఈ హత్యలను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండించాల‌ని పిలుపునిచ్చింది. హక్కుల సంఘాలు నిజనిర్ధారణ చేసి, కోర్టు ద్వారా న్యాయ విచారణ చేపట్టాలని కోరింది. ఈ హత్యలకు పాల్పడిన పోలీసుల‌ను కఠినంగా శిక్షించాల‌ని కోరింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కార్యదర్శి వెంకటేశ్ పేరుతో మంగ‌ళ‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. బూటకపు ఎన్ కౌంటర్లు చేస్తూ పౌర హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంద‌ని లేఖలో దుయ్య‌బ‌ట్టింది.

Advertisement

Next Story

Most Viewed