- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, నర్సంపేట : నర్సంపేట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో 50 పడకల నుంచి 250 పడకల ఆస్పత్రిగా అప్ గ్రేడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి నర్సంపేట ఐఎంఎ అధ్యక్షుడు డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ.. నూతన భవన నిర్మాణానికి రూ 66 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు తెలిపారు. నియోజక వర్గంలోని ఆరు మండలాల ప్రజలకు పెద్ద దిక్కుగా ఉన్న నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆభివృద్ది పరిచేందుకు ఎమ్మెల్యే ఎంతో శ్రమిస్తున్నారన్నారు. ప్రజలు కిడ్నీల సమస్యతో డయాలసిస్ కు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి 2016-2017లో అప్పటికీ ఎమ్మెల్యే కానప్పటికీ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. బ్లెడ్ బ్యాంకు, ఐ.సి.యూ ని సైతం అభివృద్ధి చేశాడని గుర్తుచేశారు.
కరోన మహమ్మారి విజృంభించిన సమయంలో నియోజక వర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి తన మిత్రుడు ఎన్.ఆర్.ఐ సహకారంతో 20 ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారన్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేద ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఆస్పత్రిలో అవసరమైన పరికరాలు, వైద్యుల కొరత తీరుస్తున్నారని తెలిపారు. వివిధ రకాల వ్యాధులుతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్, వరంగల్ లాంటి కార్పోరేట్ ఆస్పత్రులలో చికిత్స పొందిన ఎంతో మంది పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా డబ్బులు సైతం మంజూరు చేయించి ఎమ్మెల్యే ఆదుకుంటున్నాడన్నారు. అంకిత భావంతో కృషి చేస్తున్న ఎమ్మెల్యే కి నియోజక వర్గ ప్రజలు రుణపడి ఉన్నారన్నారు.