విజయ్.. ‘లెట్ మీ సింగ్.. ’

by Shyam |
విజయ్.. ‘లెట్ మీ సింగ్.. ’
X

ళయదళపతి విజయ్ ‘మాస్టర్’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ఈ మూమెంట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చింది. అనిరుధ్ మ్యూజికల్‌లో స్వయంగా విజయ్ పాడిన ఈ పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. ‘ఓరు కుట్టి కథ'(ఒక చిన్న కథ) సాంగ్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ఐదు లక్షలకుపైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ‘లెట్ మీ సింగ్ ఏ కుట్టి స్టోరీ.. పే అటెన్షన్ .. లిజెన్ టు మి’ అంటూ విజయ్ తన వాయిస్‌తో సాంగ్‌ను అదరగొట్టగా… యూట్యూబ్ రికార్డ్స్‌ను షేక్ చేస్తుంది.

కాగా ‘మాస్టర్’ సినిమా షూటింగ్ సమయంలోనే విజయ్‌పై ఐటీ రైడ్స్ జరగడంతో ఆగ్రహంగా ఉన్న ఫ్యాన్స్ ఈ సాంగ్‌తో కాస్త ఉపశమనం పొందారు. పైగా విజయ్ సాంగ్ పాడడంతో ఎలాగైనా ఈ పాటతో సోషల్ మీడియా రికార్డ్స్ బద్ధలు కొట్టాలని కంకణం కట్టుకున్నారు. ఆ ప్రయత్నంలోనే ఉన్నారు కూడా. అందుకే పాట రిలీజైన నిమిషాల్లోనే ఇన్ని వ్యూస్ సంపాదించింది.
సినిమాలో విలన్‌గా విజయ్ సేతుపతి నటిస్తుండగా… లోకేష్ గంగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తుంది. మాళవిక మోహనన్, అర్జున్ దాస్, ఆండ్రియా, శంతను ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది.

Advertisement

Next Story