‘బీస్ట్’ మూడ్‌లో ఇళయ దళపతి.. ఫ్యాన్స్‌కు బర్త్‌డే గిఫ్ట్

by Shyam |
Vijay-Beast
X

దిశ, సినిమా : కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ 65వ సినిమా ఫస్ట్ లుక్‌కు సంబంధించిన కౌంట్‌డౌన్‌కు ఎట్టకేలకు తెరపడింది. జూన్ 22న విజయ్ 47వ పుట్టిన రోజు సందర్భంగా తన లేటెస్ట్ ఫిల్మ్ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మేకర్స్ ఈ సినిమాకు ‘బీస్ట్’ టైటిల్‌ను ఖరారు చేయగా.. దళపతి ఫ్యాన్స్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ మూవీలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

మార్చి 31న పూజా కార్యక్రమాలు జరుపుకున్న చిత్రం ఇప్పటికే జార్జియాలో మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకోగా.. సెకండ్ షెడ్యూల్‌ను చెన్నైలో ప్లాన్ చేశారు. ఇక రిలీజ్ డేట్ గురించి అషీషియల్‌గా ప్రకటించనప్పటికీ వచ్చే ఏడాది తమిళ్ న్యూ ఇయర్ సందర్భంగా ‘బీస్ట్’ మూవీ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే, ‘మాస్టర్’ డైరెక్టర్ లోకేశ్ కనకరాజుతో విజయ్ మరో ఫిల్మ్ చేయనున్నాడని తెలుస్తుండగా.. డైరెక్టర్ అట్లీ కూడా లైన్‌లో ఉన్నట్టు సమాచారం. అయితే బర్త్‌డే రోజున అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement

Next Story