- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కారణంగా మారిపోయిన లిఫ్ట్ డిజైన్!
కరోనాతో కలిసి జీవించక తప్పదు అని మానవాళి అర్థం చేసుకుంది. అందుకే నిత్యజీవితంలో ఉపయోగపడే వస్తువులన్నింటిని కరోనా స్టైల్‌కి మార్చేస్తున్నారు. థాయ్‌లాండ్‌లోని ఓ మాల్ అందుకు తగినట్లుగా తమ లిఫ్ట్‌లలో కొన్ని మార్పులు చేసి డిజైన్ మార్చేసింది. ఇన్నాళ్లు లిఫ్ట్‌లో ఎక్కగానే బటన్లను చేతులతో నొక్కాల్సి వచ్చేది. కానీ కరోనా సోకే అవకాశాలు ఉన్న కారణంగా ఈ పద్ధతి మార్చుకోవాల్సి ఉంది. అందుకే బ్యాంకాక్ సీకోన్ స్క్వేర్‌లో లిఫ్ట్‌లలో కాలితో నొక్కే బటన్లు అమర్చారు.
కారు బ్రేకుల్లా ఉన్న కాలితో నొక్కే పెడళ్లను అమర్చి, కావాల్సిన ఫ్లోర్‌కి వెళ్లడానికి వీలయ్యే ఏర్పాటు చేశారు. ఇలా చేయడం వల్ల వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చిందని మాల్ యజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మార్చి నుంచి లాక్‌డౌన్‌లో ఉన్న థాయ్‌లాండ్ మొదటిసారిగా ఆదివారం రోజున మాల్స్ ఓపెన్ చేసింది. ఇప్పటివరకు అక్కడ 3034 కేసులు నమోదు కాగా, 56 మంది చనిపోయారు. కరోనా కారణంగా అక్కడి టూరిజం రంగం బాగా దెబ్బతినే అవకాశాలు ఉన్న కారణంగా టూరిస్టులకు ఇబ్బంది కలగకుండా దాదాపు అన్ని సౌకర్యాలను కరోనా రాకుండా చూసుకునే వీలుగా మార్చనున్నట్లు తెలుస్తోంది.