- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెస్లా మరో ముందడుగు.. భారత్ లోకి నాలుగు టాప్ మోడల్స్
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా సంస్థ భారత్‌లో తన కార్ల తయారీ లేదా దిగుమతికి అనుమతి సాధించినట్టు తెలుస్తోంది. దేశీయ రోడ్లకు అనుగుణంగా ఉన్న నేపథ్యంలో టెస్లా కార్లకు ఆమోదం లభించిందని, మొత్తం నాలుగు మోడళ్లను దేశీయ మార్కెట్లో తెచ్చేందుకు అనుమతి సాధించినట్టు సమాచారం. కేంద్రం నియంత్రణలో ఉన్న వాహన్ సేవ ప్రకారం.. టెస్లా ఇంక్ భారత అనుబంధ సంస్థ టెస్లా ఇండియా మోటార్స్ తన నాలుగు మోడల్స్ కు, వేరియంట్లకు ఆమోదం సాధించింది. నిర్దిష్ట ప్రమాణాలను పూర్తి చేసుకున్న తర్వాత మార్కెట్లోకి విడుదల చేసే అంశం తేలనుంది. ఏ మోడల్, వేరియంట్ల అనే దానిపై అధికారికంగా స్పష్టత రాలేదు.
మోడల్ 3, మేడల్ వై కార్లు ఉండోచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, భారత మార్కెట్లో టెస్లా లాంటి కార్లు పట్టు సాధించడం అంత సులభమైన విషయం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశీయంగా విక్రయించబడుతున్న కార్లలో ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) 1 శాతం మాత్రమే ఉన్నాయి. టెస్లా కార్లు చాలా ఖరీదైన మోడల్ కావడం, దేశీయంగా చాలా తక్కువగా మాత్రమే ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండటం వల్ల కొంతమేర ప్రతికూలత ఎదురు కావచ్చు. దీనికి తోడు దిగుమతి సుంకాలను తగ్గించాలని భావిస్తున్న టెస్లా, దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చాకే ఎప్పుడనేది ప్రకటించవచ్చు.